కొనసాగుతున్న భక్తుల రద్దీ


 TV77తెలుగు తిరుమల :

 భక్తుల రద్దీ కొనసాగుతోంది.అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి క్యూ వెలుపలికి వచ్చింది. శనివారం శ్రీవారిని 88,026 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.    50,652 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.34 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.