TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్:
ధవళేశ్వరం ఊరుకాల్వను అభివృద్ధి చేయాలని కోరుతూ ధర్నా
ధవలేశ్వరం గ్రామ పంచాయతీ వద్ద టిడిపి. బిజెపి పార్టీలు నిరసన
ధవలేశ్వరం గ్రామపంచాయతీ ప్రజలను ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న ఊరుకాల్వను కూడిక తొలగించాలని. శాశ్వతంగా సిమెంట్ గోడను నిర్మించాలని స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం బిజెపి. టిడిపి పార్టీలు సంయుక్తంగా ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా టిడిపి. బిజెపి నాయకులు పిన్నింటి ఏక బాబు, ఒంటెద్దు స్వామి లు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సాంకేతిక తప్పిదాలతో ఊరుకాల్వను అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. కోట్ల రూపాయల మేర ఊరుకాల్వను నిర్మాణం పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇంజనీరింగ్ విధానాలు కు వ్యతిరేకంగా ఊరుకాల్వను కెనాల్ రోడ్డు నుండి. సిసి డ్రైన్లు నిర్మాణం చేశారని మధ్యలోనే నిలిపివేయడం వల్ల సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం లోనైనా డ్రైన్లు గోదావరి గట్టు నుండి నిర్మించాలని కాలువలో పూడికను తొలగించాలని ప్రజలను మురికి నీరు ఉప్పు నుండి కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి సూరిబాబు కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్రాల వెంకట్రావు, కొండలరావు, ప్రకాష్ రావు, త్రినాధ రావు, విజయ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.