TV77తెలుగు రాజమహేంద్రవరం :
వాజ్మయ బ్రహ్మ, జానపదుల సేకరణ కర్త, స్వర్గీయ నేదునూరి గంగాధరం వాజ్మయ సాహిత్యాన్ని ఆయన చేసిన కృషిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కుమార్తె ఇందాని సూర్య ప్రభావతి విజ్ఞప్తి చేశారు. స్థానిక నేదునూరి గంగాధరం స్మారక గ్రంథాలయంలో శుక్రవారం జరిగిన సభలో ఆమె మాట్లాడారు. ఈ సభలో తన తండ్రి జీవించిన కాలంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో సేకరించిన జానపదాలు. పాటలు. సామెతలు. పుణ్యక్షేత్రాలు, రచనలు పై పునర్ ముద్రించిన పూజ్య గౌతమి తీర పుణ్యక్షేత్రములు పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు . ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో పూర్వకాలంలో ప్రజలు జానపదాలు. పాటలు. ఆల పించడం ద్వారా శారీరక. మానసిక. అలసటను మరిచిపోయావారని అన్నారు. జానపదాలే కాకుండా జ్యోతిష్యం ,వాస్తు శాస్త్రం, ఆయుర్వేదం తదితర అంశాలపైనా నేదునూరి గంగాధరం చేసిన కృషి నేటి యువతరం ముందుకు తీసుకువెళ్లాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా సభాధ్యక్షత వహించిన కృష్ణ శర్మ మాట్లాడుతూ , నేదునూరి గంగాధరం జానపద సాహిత్యం ఆనాటి తెలుగు సినిమా రంగాలలోను ప్రత్యేకత పొందిందన్నారు. ముందుగా నేదునూరి గంగాధరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శిరిగి బత్తిన రత్న కుమార్. రంగస్థల నటి ఉమాదేవి. తదితరులు పాల్గొన్నారు.