ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి


 TV77తెలుగు కాకినాడ క్రైమ్ :

కాకినాడ జిల్లా వాకలపూడి బీచ్ రోడ్డులో కోరమాండల్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కాకినాడకు చెందిన తరుణ్, తెలంగాణలోని గోదావరిఖనికి చెందిన సంజీవ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని కాకినాడ ప్రభుత్వఆసుపత్రికి తరలించారు.