TV77తెలుగు రాజమహేంద్రవరం:
రఘురామ్ కృష్ణం రాజు వ్యూహం ఫలిస్తుందా !
శివసేన పై జరిపిన కుట్ర ఆంధ్ర సర్కార్ పై ఫలిస్తుందా !
చిరంజీవి కి ఆహ్వాన ఆంతర్యం ఆంధ్రుల దృష్టి మళ్లించే కుట్రలో భాగమేనా !
మోది ని ఆంధ్రప్రదేశ్ రప్పించటంలో చక్రం తిప్పిన వ్యూహ కర్త ఎవరు .
ప్రధాని మోదికి విగ్రహా రాజకీయాలు పై వున్న శ్రద్ద ప్రత్యేక హోదా అమలు పై చూపిస్తే బాగుంటుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హితవు పలికారు. ప్రజా క్షేత్రంలో విశ్వసం కోల్పోతున్న మోది ఇతర రాష్ట్రాలపై విషపు కోరలు రక్కిస్తున్నారని, దశాబ్దాలుగా ఆంధ్రులు బిజెపి జండాను పాకిస్తాన్ జండా వలే చూస్తు రాష్ట్రం లోకి అడుగు పెట్టనీయటం లేదని మోది (బిజెపి)సర్కార్ ఆంధ్ర సర్కార్ ను అతలాకుతలం చేసి ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధి లేకుండా అంతం చేయాలని మోది, అమిత్ షా లు ఆంధ్రప్రదేశ్ పై కక్ష గట్టారని, విద్వావంశక వ్యూహాలతో ఆంధ్రుల మధ్య కుల మత వివాదాలకు, ప్రాంతీయ విబేధాలకు, ఆర్ధిక సంక్షోభాలకు ఆజ్యం పోసి ఎలాగైనా ఆంధ్రాలో బిజెపి జెండా ఎగురవేయాలని మోది బృందం వ్యూహాలు పన్నుతోందని, భీమవరం సాక్షిగా విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్బంగా విగ్రహ ఆవిష్కరణ ముసుగులో ఆంధ్ర పై విష రాజకీయాలను ప్రోత్సహించటానికే నరేంద్ర మోది భీమవరం పర్యాటన చేపట్టారని, 30 అడుగుల ఎత్తు విగ్రహం, 30 కోట్లు బడ్జెట్లో 9 కోట్లు ప్రభుత్వం నిధులు, మిగిలిన సొమ్ము ఎవరు సమకూర్చారో తెలియని రాజకోట రహస్యం అని, అల్లూరి జయంతిని రాజకీయాలకు వినియోగించుకోవాలనుకోవటం బిజెపి అజ్ఞానానికి నిదర్శనం అని, అల్లూరిపై మోది సర్కార్ కు చిత్తశుద్ధి వుంటే ముందుగా పార్లమెంట్ ప్రాగణం లో అల్లూరి విగ్రహ ఆవిష్కరణ జరిపే వారని,అల్లూరి విగ్రహం పార్లమెంట్ లో వుంటే అల్లూరి ప్రతిష్ట పెరిగేదని, కొంతమంది రాజకీయ స్వలాభం కోసం ప్రధాని మోదీని భీమవరం రప్పించి అల్లూరి విగ్రహ ఆవిష్కరణ జరిపించటం అల్లూరి ఖ్యాతిని తగ్గించినట్టుగా వుందని, అల్లూరి విగ్రహాన్ని భీమవరం లో పెట్టడం కారణంగా ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజుపై లేని కొత్తకోణంగా కుల వివాదాలకు కారణం కావొచ్చునని, స్వతహాగా రాజులు కుల వివాదాలకు దూరంగా వుంటారని, రాజకీయ స్వార్థపరుల కుట్రలకు అల్లూరికి కులం మారక అంటిస్తే యావత్ తెలుగు వారి ప్రతిష్ట మంటగలిచి పోతుందని, అల్లూరి విగ్రహాన్ని అల్లూరి జిల్లాలో ప్రతిషాత్మకంగా ఏర్పాటు చేసి టూరిజంగా అభివృద్ధి పరచి వుంటే తెలుగు వారి ఖ్యాతి జాతీయ స్థాయిలో పెరిగేదని ఆయన సూచించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ జరిపించటంలో ఢిల్లీలో నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణం రాజు(RRR)కు గల శక్తి ప్రత్యర్థి వర్గాలకు తెలుస్తుంది తప్ప అంతకు మించి భీమవరానికి జరిగే మేలు లేదని,జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రులకు సాధ్యం కాని విధంగా ఒక అతిచిన్న కార్యక్రమానికి ప్రధాని మోదీని భీమవరం రప్పించటంలో ఆర్ ఆర్ ఆర్ కు గల పట్టు నిరూపించుకున్నారని, మోదీని ఆంధ్రప్రదేశ్ ను రప్పించటం ఒకటైతే ఏపి బిజెపి పార్టి అధ్యక్షులు సోము వీర్రాజు ప్రమేయం పెద్దగా లేకుండా ప్రధాని ని రప్పించటం గొప్ప విషయమేనని , ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా మోది ఆంధ్రప్రదేశ్ రావటానికి అంగీకరించిన వైనం వెనుక ఆంతర్యం అంతే పెద్ద రాజకీయ ప్రయోజనం వుంటుంది కదా ! దేశ వ్యాప్తంగా ప్రజా ప్రభుత్వాలను కూల్చటంలో అత్యంత అనుభవం గల మాస్టర్ మైండ్స్ మోది & కో యూనివర్సిటీ అని, వీరి నీచ రాజకీయాలు భారత్ లో గల అత్యధిక శాతం ప్రజలకు తెలిసిన నగ్న సత్యం అని, అల్లూరి విగ్రహ ఆవిష్కరణ ముసుగులో భీమవరం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పాలన పై జరుగు కుట్ర, ఆంధ్రప్రదేశ్ కు ఏ స్థాయిలో నష్టం జరుగుతుందోనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై తున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. మహారాష్ట్ర లో శివసేన సర్కార్ పై జరిపిన కుట్ర ఫార్ములానే ఆంధ్రప్రదేశ్ పాలనపై జరుపుతున్నారా ! ఆంధ్రప్రదేశ్ సర్కార్ లో ఒక ఏక్ నాధ్ షిండే కోసం తీవ్రంగా పరిశీలిస్తున్నారా ! ఆ షిండే ఎవరు , మహారాష్ట్రపై బిజెపి జరిపిన కుట్ర ఫార్ములా ఆంధ్రప్రదేశ్ లో అమలుచేయటం సాధ్యమేనా, మోది & కో తన సొంత పార్టి వారి కన్నా ఇతర ప్రత్యక్ష పార్టీలకు చాకచక్యంగా నమ్మక ద్రోహం చేసే వారిని అన్వేషించి వారికి తర్పీదు నివ్వటంలో మోది బృందం గొప్ప నిష్టాతులని, బిజెపి(మోది, షా)ల అంతర్గత బృందం ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయటానికి కార్పొరేషట్ శక్తుల తో కుట్రలు రచిస్తుందని,కుట్ర అమలుకు 2000 కోట్లు పైబడే ఖర్చు చేయటానికి సిద్ధంగా వుందని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించటం ఒక భాగమైతే ఏపి లో గల లక్షల కోట్లు విలువ గల సహజ వనరులను తరలించుకు పోవటమే ప్రధాన లక్ష్యం అని, మోది పాలనలో ప్రజా స్వామ్యానికి, ప్రజా ప్రభుత్వాలకు, రాజ్యంగ హక్కులకు భద్రత లేకుండా పోతుందని, మోది వారి కార్పొరేట్ సంస్థలతో ముందు ముందు ఆంధ్రప్రదేశ్ కు మరిన్ని గడ్డు పరిస్థితులు దాపరిస్తాయని, ఆంధ్రప్రదేశ్ లో గల ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రులు కాపాడుకోవటానికి ఆంధ్రులు నడుం బిగించాలని, మోది సర్కార్ కు బాంచన్ అని మ్రొక్కె రాజకీయ పార్టీలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు బహిష్కరించి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. మోది బృందం రాజకీయ కుట్ర కోణంలో భాగమే భీమవరం సభకు ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి కి ఆహ్వానం పంపించారని, ప్రస్తుతం చిరంజీవి ప్రశాంత వాతావరణంను ఆశ్వాదిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ పై నిరంతరం విషం కక్కుతున్న మోది సర్కార్ ఆంధ్రుల దృష్టి మళ్లించటానికే చిరంజీవి ని భీమవరంలో పెట్టిన మోది సభకు ఆహ్వానం పంపించారని, ఇప్పటికే పవన్ కళ్యాణ్ మోది సర్కార్ కు మద్దత్తు తెలిపి ఆంధ్రప్రదేశ్ అప్రతిష్టతో పాటుగా పెద్ద తప్పు చేసారని, చిరంజీవి మోది పంపిన ఆహ్వానాన్ని ప్రత్యేక హోదా విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ లకు నిరసనగా చిరంజీవి తిరస్కరించి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను కాపాడాలని ఆయన పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ అనే అంశం మోది కి ఒక సాకు మాత్రమే నని, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కలుషిత రహస్య మంతన రాజకీయాలను ప్రోత్సహించటానికే ఆంధ్ర పర్యటన ఖరారు చేసారని, మోది ఆంధ్ర పర్యటనను ఖరారు చేయంచటంలో RRR తో పాటుగా ఆంధ్ర కు చెందిన ఒక సీనియర్ నేత, ఒక పెద్ద కార్పొరేట్ శక్తి, ఢిల్లీలో గల కొన్ని సంపన్న శక్తులు కృషిలో భాగమే ఆంధ్ర కు మోది పర్యటన ఖరారైందని,మహారాష్ట్రలో జరిపిన బిజెపి కుట్ర ఆంధ్రాలో ఫలిస్తుందో లేదో తేలాల్సి వుందని, రాజకీయ కుట్రలకు అల్లూరి విగ్రహాన్ని వాడుకోవాలనుకోవటం క్షమించ రాని నేరంగా భావించాలని,భీమవరం ప్రజలు ఆంధ్రప్రదేశ్ కు బిజెపి చేస్తున్న ద్రోహంకు నిరసనగా మోది పర్యటనను భీమవరం ప్రజలు బహిష్కరించి అల్లూరి ప్రతిష్టను కాపాడాలని, ఢిల్లీ కుట్రల నుండి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవటానికి ఆంధ్రులు అప్రమత్తం గా వుండి ప్రత్యామ్నాయం రాజకీయ నిర్మాణాన్ని ఆంధ్రులు ప్రోత్సహిన్చాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ దుడ్డె త్రినాద్వ, ఎండి హుస్సేన్, సిమ్మా దుర్గారావు, మోర్త ప్రభాకర్ , కోమర్తి గోపి శ్రీనివాసరావు , వనుం సతీష్ , టి. దుర్గ , టి శ్రీను , టి. బేబి, శ్రీనివాసరావు, దుడ్డె సురేష్, మేడిచర్ల శ్రీనివాసరావు, వర్ధనపు శరత్ కుమార్, వాడపల్లి జ్యోతిష్, నాగురి అన్నపూర్ణ , మాసా సుభద్ర , మాసా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేడ శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్