TV77తెలుగు భీమవరం :
ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులైన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి కుటుంబ సభ్యులను మోదీ కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. ఆ వీర దంపతుల కుమార్తె పసల కృష్ణభారతికి పాదాభివందనం చేశారు. 90 ఏళ్ల వయసు కలిగిన కృష్ణభారతి వీల్ ఛైర్‌లో ఉండగా ప్రధాని ఆమె పాదాలను తాకి, నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులు జాతిపిత గాంధీని అభిమానించి అనుసరించటమే గాదు.ఏకంగా ఆవాహన చేసుకొని. మనసా వాచా ఆచరించి చూపిన అరుదైన స్వాతంత్య్ర సమర యోధులుగా ప్రఖ్యాతిగాంచారు.