TV77తెలుగు రాజమండ్రి రూరల్ క్రైమ్:
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో దారుణం
స్విమ్మింగ్ పూల్ లో పడి బాలిక మృతి
కడుపుకోత మిగిల్చిన యాజమాన్యం నిర్లక్ష్యం
కేసు లేకుండా రాజకీయ మంతనాలు
స్థానిక దివాన్ చెరువు వద్ద నున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో దారుణం జరిగింది. బుడిబుడి అడుగులతో ముచ్చటైన మాటలతో పది రోజుల క్రితమే ఎల్కేజీ లో జాయిన్ అయినా కోరుపల్లి ఓజశ్రీ. ( 7 ) యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్కూల్ ఆవరణలో సిమ్మింగ్ పూల్ లో పడి నూరేళ్లు నిండాయి. ఒకే ఒక్క సంతానం కలిగిన బాలిక తల్లిదండ్రులకు కడుపుకోతను యాజమాన్యం మిగిల్చింది. హైదరాబాదులో సాఫ్ట్వేర్ దంపతులైన బాలిక తల్లిదండ్రులు వారం పది రోజుల క్రితమే నగరంలోని బంధువుల సంరక్షణలో ఉంచి స్కూల్లో చేర్పించి హైదరాబాద్ వెళ్లారు. శనివారం సాయంత్రం స్కూల్ బస్సు ఎక్కుతున్న సమయంలో బాలిక స్విమ్మింగ్ పూల్ లో పడి వెంటనే అపస్మారక స్థితి లోకి వెళ్ళింది వెళ్ళింది. సమాచారం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం ఇటువంటి ప్రాథమిక చికిత్స లేకుండానే రాజానగరం లోని జిఎస్ఎల్ హాస్పటల్ కి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు తెలుస్తోంది. స్కూల్ యాజమాన్యం చలమురి శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసుకు దగ్గరి బంధువులు కావడంతో కేసు లేకుండా పోస్టుమార్టం జరపకుండా బాధితులకు నష్ట పరిహారం ఇచ్చేలా రాజకీయ మంతనాలు జరుగుతున్నాయని ఇన్నిస్ పేట కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ళ అచ్యుత రామారావు మీడియాకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న బొమ్మూరు పోలీస్ లు విచారణ జరుపుతున్నామని సిఐ, లక్ష్మణ్ రెడ్డి తెలిపారు.