ధవలేశ్వరం ఇక అభివృద్ధి బాటలో నా..


TV77తెలుగు రాజమహేంద్రవరం రురల్ :

ధవళేశ్వరం గ్రామాభివృద్ధికి కృషి చేస్తా 

పంచాయతీ కార్యదర్శి గా బాధ్యతలు చేపట్టిన సూరిబాబు

రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని పెద్ద పంచాయతీ గా పేరొందిన ధవలేశ్వరం గ్రామపంచాయతీ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సూరి బాబు తెలిపారు. ఇటీవల కొత్తపేట పంచాయతీ నుండి ధవలేశ్వరం పంచాయతీ కి బదిలీ అయ్యారు. గత పదేళ్లుగా మేజర్ పంచాయతీ ధవళేశ్వరంలో ఇన్చార్జీలు కార్యదర్శిగా పలువురు పనిచేసిన సమయాల్లో ప్రజల సమస్యలు పరిష్కారం నోచుకోలేదు అదే విధంగా గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి కుంటుపడింది. ఈ సమయంలో కోట్ల రూపాయల మేర ప్రభుత్వ నిధులు ప్రజల సొమ్ము దుర్వినియోగం అయ్యాయని ,అవినీతి ,అక్రమాలు జరిగాయని తెలుస్తుంది. గ్రామంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు నాయకులు, ప్రజల సమస్యలపై ఉద్యమాలు నిరసనలు నిరాహారదీక్షలు చేసినప్పటికీ ఇన్చార్జి కార్యదర్శిల ఉండడంతో పరిష్కారానికి నోచుకోలేదు అని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇటీవల బదిలీలను చేపట్టగా ఆ క్రమంలో ధవలేశ్వరం పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిగా సూరిబాబు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కలిసిన మీడియా ప్రతినిధి తో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిధులు, పంచాయతీ నిధులు, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. గ్రామంలో సమస్యలను పరిశీలించడానికి గ్రామంలో అన్ని ప్రాంతాల్లో పరిశీలిస్తానని గ్రామ నాయకులు, ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రధానంగా  ఊరకాలువ అభివృద్ధికి శానిటేషన్ మెరుగుదలకు మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు అందించేలా కృషి చేస్తానన్నారు.