ఆంధ్రులారా మోది ఇచ్చిన మట్టి - నీరు ఇచ్చేద్దాం.


 TV77తెలుగు రాజమహేంద్రవరం:

నరేంద్ర మోది అంటేనే నమ్మించి మోసం చేయటం. 

ఆంధ్ర రాజకీయాలను కలుషితం చేయటమే బిజెపి లక్ష్యం. 

మోదిని నమ్ముకుంటే ఎంపి రఘురామ్ ను ముంచినట్టే ముంచుతారు. 

భీమవరం సభలో మోది ఎత్తులను చిత్తు చేసిన జగన్.  

ఆంధ్రాలో బిజిపి సన్నిహిత పక్షాలను ఓటుతో తరిమేద్దాం రండి తరలి రండి అని ఈరోజు  రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయం వద్ద  జరిగిన పార్టి వారాంతపు సమావేశం అనంతరం ప్రధాని మోది ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన మట్టిని తిరిగి ఇచ్చేస్తున్నాం అని నిరసన వ్యక్తం చేసిన ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తో పలువురు . ఈసందర్బంగా మేడా శ్రీనివాస్ మాట్లాడుతున్నావ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భావం నాడు భారత ప్రధాని హోదా లో ఆంధ్రప్రదేశ్ కు  విచ్చేసిన నరేంద్ర మోది ఆంధ్రుల అభివృద్ధి కని మట్టి ముంత, నీరు ఇచ్చి ఆంధ్రులను అవమానించారని, శుభకార్యం  నాడు మట్టి ముంత ఇవ్వటం అశుభం అని గ్రహించే మోది కుట్రపూరితంగా మట్టి ఇచ్చారని,ప్రధాని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా - పారిశ్రామిక రాయితీలతో కూడిన విభజన హామీలలను అమలు చేస్తాం అని పచ్చిగా మోసం చేసిన ప్రధాని ఏ దేశంలోను వుండరని, మోది సర్కార్ హిందూయిజం ముసుగులో మతోన్మాద వివాదాలకు ఆజ్యం పోస్తుందని, మోది పాలన భారతదేశ భద్రతకు అత్యంత ప్రమాదం అని, ప్రభుత్వాలను పడగొట్టడం, శాంతి భద్రతల సమస్యలను సృష్టించటం, సంపదను కార్పోరేట్ శక్తులకు దోచిపెట్టడం, భారత్ సంపదను దోచుకున్న ఆర్ధిక నేరగాళ్లను విదేశాలకు పంపిచేయటం వంటి సేవలకే మోది అధికారిక సేవలు అమలు చేస్తున్నారని, భారత్ లోగల అనేక రాష్ట్రాల్లో  అవినీతి కుంభకోణాలను పరోక్షంగా ప్రోత్సహించేది మోది సర్కారే తిరిగి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తు మోది సర్కార్ కు బానిసలుగా మార్చుకునేది మోది బృందమే నని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ను ,  ఇతర రాష్ట్రాల్లో ను గ మోది సర్కార్ అడుగు పెట్టిన చోట ఆ రాష్ట్రాలు సమస్యలు కొని తెచుకున్నట్టే నని, వీరు అడుగు పెట్టిన నెల అభివృద్ధి ఆవిరై పోతుందని, రాష్ట్ర అభిమానం, దేశ అభిమానం, ప్రజా అభిమానం లేని వారు మాత్రమే బిజెపి పార్టీలోచక్కెర్లు కొడుతు ఢిల్లీ బిజెపికి భజన చేస్తు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ను మంట గలుపుతున్నారని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ, గుజరాత్ పె(గె)ద్దలకు తాకట్టు పెడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.నరేంద్ర మోది అంటే "న"అంటే నమ్మించటం  , "మో" మోసగించటం అని నిరూపించుకుంటున్నారని, ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశ ప్రజలను అందరిని సమానంగా చూడాలని, ఇచ్చిన మాటకు కట్టుబడాలని, స్థాయి మరిచి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించటం మోదికి తగదని, మా ఆంధ్రులు ఎంత అమాయకులో, మంచివారో భీమవరం సభకు విచ్చేసిన నరేంద్ర మోదికి అర్ధమయ్యి వుండాలని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు మోది సర్కార్ ఇంత అన్యాయం చేస్తున్నా ఏ ఒక్కరు ప్రత్యేక హోదాహామీలు, పోలవరం ప్రాజెక్ట్ కోసం గొంతు ఎత్త నీయ కుండా  

మీ అధికారం తో శాసించారని, 

మా నేతలైతే ప్రధాని తో సెల్ఫీలు దిగటం పైన చూపిన శ్రద్ద ఆంధ్ర ప్రయోజనాల కోసం పెదవి విప్పలేదని దీన్ని బట్టి మా పాలకులు ఎంత మంచోరో అర్ధమై వుంటుందని, ఒక గొప్ప వీరుడు విగ్రహం చూస్తు కూడా మిమ్మల్ని ప్రశ్నించకుండా మీకు చప్పట్లు కొట్టారు చూడండి అది మా ఆంధ్రుల అమాయకత్వం అని,ఆంధ్రులారా ఆంధ్రులను అవవమానించిన వారి సభలకు, మన అభివృద్ధి ని దోచుకుంటున్న వారి సభలకు వెళ్లకుండా మన ఐఖ్యతను తెలియ చేయటంపై ఇకనైనా దృష్టి సారించాలని, ఆంధ్రాలో ఏ పార్టి అధికారంలోకి వచ్చినా  ఆ పార్టి ని మన బానిసను చేసుకుందాం అనే మితి మీరిన మోది అహంభావాన్ని ఆంధ్రులు దెబ్బతీయాలని అందుకోసం ప్రతి ఆంధ్రుడు మాతృ ప్రేమను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్న మైనదని ఆయన పిలుపు నిచ్చారు. ఆంధ్ర రాజకీయాలను కలుషితం చేస్తు ఇక్కడ గల అపార ఖనిజ సహజ వనరులను దోచుకోవటమే మోది సర్కార్ ప్రధాన లక్ష్యం అని, మోది సర్కార్ కు ప్రజా స్వామ్యం అంటే విశ్వాసం లేదని, ఓటుకు నోటును, సాంకేతికతను వారి మేధస్సు తో కలుషితం చేస్తు పాలనా పగ్గాలను శాసిస్తున్నారని, మోది తో సాన్నిహిత్యం వున్న ఆంధ్ర పార్టీల వారిని అక్కున చేర్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్ వుండదని మాతృ భూమి అభిమానంతో ప్రతి ఆంధ్రుడు మన రాష్ట్ర ప్రగతిని కాపాడుకోవాలని, మన పాలకులు మోది సర్కార్ బెదిరింపులకు తలొగ్గి ఆంధ్ర అభివృద్ధిని నిర్వీర్యం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్  పైన, ఆంధ్రులపైన మోది సర్కార్ కక్ష సాధిస్తుందని, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అనిశ్చితిని సృష్టిస్తు గుజరాత్ రాష్ట్రంలో సంపదను సృష్టించుకుంటున్నారని, మొత్తం భారతీయులు గుజరాత్ కనుసైగలో జీవించే లాగ చేయటమే మోది వారి కార్పొరెట్స్ అంతిమ కర్తవ్యం అని, ఆంధ్ర లో గల ప్రధాన రాజకీయ శక్తులను మోది సర్కార్ కీలు బొమ్మలను చేస్తు ఆడిస్తుందని, అన్ని రాష్ట్రాల్లో వంట గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు ప్రజలకు భారం చేస్తు గుజరాత్ రాష్ట్రంలో అనువుగా వుండే విధంగా పక్షపాత పాలన సాగిస్తున్నారని, మోది పాలనలో సామాన్య మధ్యతరగతి వారి జీవితాలు బారంగా మారాయని, సమస్యలను సృష్టిస్తు ఆ సమస్యలను రాజకియం చేస్తున్నది మోది సర్కారే నని, మోది పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు వణికి పోతున్నాయని, చట్ట బద్దమైన విధులు అధికారులు నిర్వహించ లేకపోతున్నారని, వేసిన ఓటుకు సైతం మోది పాలనలో భద్రత లేకుండా పోయిందని ఆయన తీవ్ర ఆవేదన చెందారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రధాని నరేంద్ర మోది మట్టి ఇచ్చి అవమానించారని, ఆంధ్రులను మట్టికొట్టుకుని పోండి అని మట్టి ఇచ్చి  సంకల్పించారని, మోదికి స్వచ్ఛమైన సారవంతమైన మట్టిని తిరిగి ఆంధ్రుల తరుపున  ఇచ్చేస్తున్నామని, ప్రత్యేక హోదా, విభజన హామీలను, పోలవరం ప్రాజెక్ట్ ను సాధించి తీరుతాం అని, మోదీని నమ్ముకుంటే నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ్ కృష్ణం రాజును ముంచి నట్టే ముంచుతారని, ఆంధ్రప్రదేశ్ లో మోది సర్కార్ తో  ప్రత్యేక్షంగాను, పరోక్షంగాను సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న ఆంధ్ర ప్రధాన రాజకీయ పార్టీలకు మోది మొండి  చెయ్యి ఇవ్వటం ఖాయమని,ఆంధ్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, హక్కులు, ఆత్మగౌరవం ముఖ్యమని ఆంధ్రులు నిరూపించాలని, మోదీని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవడమే నని, మోదీతో కొనసాగితే ఈ వి ఎం లతో గెలవచ్చు అనుకునే సన్నిహిత పార్టీలకు భంగపాటు తప్పదని ఆయన హెచ్చిరించారు. భీమవరం సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోది  కుయుక్తులకు చెక్ పెట్టారని, సభ మొత్తం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరిగిందని, అల్లూరి సభ సాక్షిగా నరేంద్ర మోది పై జగన్ పట్టు సాధించి ఆంధ్రుడు అని నిరూపించుకున్నారని, ఆంధ్ర ప్రయోజనాలు, హక్కుల పట్ల జగన్మోహన్ రెడ్డి అదే ఉక్కు  సంకల్పంతో మోది మెడలు వంచి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ సాధిస్తే ఆంధ్రులు హృదయాల్లో నిలిచి పోతారని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రసంగించారు . 

జై ఆంధ్ర.. సేవ్ ఆంధ్రప్రదేశ్. 

సభకు ఆర్పిసి నగర సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు  అధ్యక్షత వహించారు. 

ఈ నిరసన సభలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, కాసా రాజు, దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్, వాడపల్లి జ్యోతిష్, వల్లి శ్రీనివాసరావు, వల్లి వెంకటేష్, చెట్టి రత్నకుమార్, మట్టపర్తి తులసి, కొల్లి సత్యనారాయణ, మేడిచర్ల శ్రీనివాసరావు, సిమ్మా దుర్గారావు, వనుం సతీష్ కుమార్, కోట సుశీల, కోట రాజశేఖర్, నాగురి బాబీ, నాగురి అన్నపూర్ణ, మాసా అప్పాయమ్మ, గోపాలవరపు సత్తిబాబు గోపాలవరపు ప్రభావతి, కొల్లిమల్లి అనంతలక్ష్మి, కొల్లిమల్లి లక్ష్మణరావు, మండవల్లి శంకర్, మండవల్లి సూరిబాబు, మండవల్లి వెంకటేశ్వరరావు, దుడ్డె త్రినాద్  పాల్గొనియున్నారు.మేడా శ్రీనివాస్, MA, LLM, MA(Jour) వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్౦