విజయవంతమైన గోదావరి గర్జన


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

అవినీతి , అప్పుల వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి బీజేపీకి పట్టం కట్టండి

బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పిలుపు

 గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అవినీతి అక్రమాలతో లక్షల కోట్ల అప్పులు ఊబిలో కూరుకుపోయి అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలను సంక్షోభంలోకి నెట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు రాష్ట్రంలో లాండ్ మాఫియా ఇసుక, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతుందని ని శాంతిభద్రతలు క్షీణించాయని నడ్డా తీవ్రంగా విమర్శించారు . వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాజమహేంద్రవరంలో బిజెపి ఆధ్వర్యంలో బిజెపి ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో మంగళవారం గోదావరి గర్జన కార్యక్రమం జరిగింది . బిజెపి నాయకుడు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవధర్ జరిగిన అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేపీ నడ్డా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అస్తవ్యస్త ఆర్థిక విధానాలను దుయ్యబట్టారు.   కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా పేర్లు మార్చుకుని కేంద్ర  నిధులను జగన్ ప్రభుత్వం మళ్లీ ఇస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇష్టమైన సామాజిక వర్గాల సంతృప్తి కోసం లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు  కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి సంక్షేమం మౌలిక వసతులు కల్పన స్వాతంత్ర్యం అనంతరం ఏ ప్రభుత్వంలోనూ చేయలేదని అన్నారు భారత దేశ అభివృద్ధిని 2014 ముందు ఆ తర్వాత గా లెక్కించాలని ప్రధాని మోడీ నిజాయితీ పారదర్శక పరిపాలన దేశంలోనే కాక , ప్రపంచవ్యాప్తంగా దేశానికి విశ్వసనీయత పెరిగిందని అన్నారు ఎస్సీ ,ఎస్టీ, బిసి ,మైనారిటీ ,మహిళా వర్గాల సంక్షేమానికి చేసిన కృషి ఎనలేనిదని అన్నారు దేశంలో తీవ్రవాదంతో సతమతమయ్యే భారత దేశ ప్రజలకు మోడీ పరిపాలన లో తీవ్రవాదం అన్నది కనిపించకుండా పోయిందన్నారు కరుణ మహమ్మారి సమయంలో దేశ ప్రజలను  రెండు డోసుల వ్యాక్సినేషన్ తో దేశ ప్రజలను రక్షించడమే కాక కొన్ని దేశాలకు కోట్లకొలది వ్యాక్సినేషన్ ను కంపెనీ పంపిణీ చేశారు అన్నారు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఉపాధి అవకాశాలు లేవని నిరుద్యోగం నిరక్షరాస్యత అరాచక పరిపాలన పెరిగిందని పారిశ్రామిక పెట్టుబడులు రాక రాష్ట్రం అధోగతి పాలు అయిందని ప్రభుత్వ విధానాలను విమర్శించారు బిజెపి రావాలి వైసిపి పోవాలి అను నినాదాలతో బిజెపి కార్యకర్తలు నాయకులు సమిష్టి కృషితో రానున్న ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు అంతకు ముందు పలువురు బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో బిజెపికి ప్రజలు ఆదరణ పెరుగుతుందని వాడ వాడల్లో నూ బూత్ కమిటీలను నిర్మించాలని పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. రాజమండ్రి వాస్తవ్యురాలు సినీనటి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎంపీ జయప్రద చేసిన ప్రసంగం మహిళలను విశేషంగా ఆకర్షించింది రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలపై ఆమె విమర్శలు గుప్పించారు. తొలుత వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా నడ్డా ప్రసంగానికి ముందు పురందేశ్వరి ఇతర ప్రముఖులు ప్రసంగిస్తారని ఆశించిన బిజెపి నాయకులకు కార్యకర్తలకు వారు మాట్లాడకపోవడం నిరాశ కలిగించింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దగ్గుపాటి పురందేశ్వరి, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, జి మాధవ్ సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ,సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి, సినీ నటి మాజీ ఎంపీ జయప్రద, రేలింగి శ్రీదేవి , పరిమి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నడ్డా కు ఘన స్వాగతం

రాజమహేంద్రవరంలో మంగళవారం నిర్వహించిన  గోదావరి గర్జన బహిరంగ సభకు విచ్చేసిన బిజెపి జాతీయ అధ్యక్షుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డాకు విమానాశ్రయంలో పార్టీ నాయకులు, క్యాడర్ ఘనంగా స్వాగతం పలికారు. బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుండి స్థానిక మంజీర హోటల్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలను అందుకున్న లబ్ధిదారులతో నడ్డా ముచ్చటించారు. అనంతరం బహిరంగ సభకు విచ్చేసి సుమారు నలభై నిమిషాలు  రాష్ట్ర ప్రభుత్వ విధానాలను దుయ్య బట్టారు. గోదావరి గర్జన విజయవంతం కావడంతో బిజెపి శ్రేణులు ఆనంద పరవశంలో తేలియాడారు.