నిన్నటి నుంచి వర్షాలు


 TV77తెలుగు అమరావతి :

 నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప, విశాఖ, ఒంగోలు, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది.