TV77తెలుగు కాకినాడ :
తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కురిశాయి. దీంతో కాకినాడ రూరల్లో అత్యధికంగా 112.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా గండేపల్లిలో 14.6 నమోదైంది. అలాగే జిల్లా మొత్తంగా 1102.2 మిల్లీమీటర్లు, సరాసరి 52.5 మిల్లీమీటర్లు నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.