TV77తెలుగు హైదరాబాద్ :
నేడు గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనాలు ప్రారంభం కానుందని ప్రకటించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ పూజలో భాగంగా అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పించనున్నారు.నేడు లంగర్హౌస్ చౌరస్తా నుంచి భారీ ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం అలాగే తోటలను తీసుకువెళ్తారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటల వరకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకొనుంది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తరఫున మధ్యాహ్నం 12 గంటలకు లంగర్ హౌస్ చౌరస్తాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. జులై 5 న అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నిర్వహిస్తామని చెప్పారు.ఈ సారి అమ్మవారి కల్యాణానికి 5 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నామని.అమ్మవారి కల్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్య మంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.