TV77తెలుగు రాజమహేంద్రవరం :
జగన్ కాదు ! చంద్రబాబు అవునా తేల్చుకోవాల్సిన తరుణం ఆంధ్రులపై వుంది.
జగన్ మీడియా, చంద్రబాబు మీడియా ఆంధ్రులకు జరుగుచున్న అన్యాయాన్ని దాచిపెడుతుంది.
ఢిల్లీ అధికారాన్ని ప్రశ్నించి సాధించే వారికే ఆంధ్రుడి ఓటు అని నిరూపించాలి.
ఏపిలో ప్రధాన రాజకీయ పక్షాలు సినీ నటుల మోజులో వుంటు రాష్ట్ర భవిష్యత్ ను నాటకంగా మార్చేస్తున్నారు. ప్రత్యమ్నాయమే ఆంధ్రులకు శ్రీరామ రక్ష మేడా శ్రీనివాస్, పిలుపు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
ఈ ధపా ఓటు జగన్ - చంద్రబాబు లకు వేస్తె ఆంధ్ర ఎడారి కావటం కాయమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్రులారా ఏకం కండి, ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం రండి తరలి రండి, దోపిడీకి గురైతున్న మన రాష్ట్రాన్ని కాపాడుకోక పొతే ఆంధ్రప్రదేశ్ ఎడారి గా మారే ప్రమాదం వుందని,ఆంధ్రుల మౌనం కారణం గా మన బిడ్డల భవిష్యత్ మన కళ్ల ముందే అంతరించి పోతుందని, అపార ఖనిజ సంపద గల ఆంధ్రప్రదేశ్ పాలకుల స్వార్థానికి, కార్పొరేట్ సంస్థల దాష్టీకానికి నిత్యం బలైపోతుందని, ప్రశ్నించే ఆంధ్రుల గొంతును కాళ్లతో తొక్కేస్తున్నారని, బెదిరింపులు దౌర్జన్యాలతో ఆంధ్రల భవిష్యత్ ను నిర్వీర్యం చేస్తున్నారని, రాజకీయ ముసుగు ఒప్పందాలతో రాష్ట్రం ఏ ఒక్క అభివృద్ధి కి నోచుకోవటం లేదని, ఆంధ్రాలో గల సంపదను మన పాలకులు ఇతర రాష్ట్రాల రాజకీయ అవసరాలకు ఆమ్మేస్తున్నారని, ఆంధ్ర ప్రజలను వలసలు పంపిస్తున్నారని, ఆంధ్ర లో ప్రధాన రాజకీయ అధికార దాహానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అడుగంటి పోతున్నాయని, ఆంధ్రలోగల ప్రధాన రాజకీయ పక్ష పాలకులు మెరుగైన పాలనపైన, అభివృద్ధి పైన దృష్టి సారించటంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతున్నారని, ప్రస్తుత నేటి పాలకులు అమాయకులు కారని , అసమర్థులూ కారని ప్రజల మాన ప్రాణాలను, ఆస్తులను, ప్రజా ధనాన్ని, బ్యాంక్ లను దోచుకునే అఘంతకులని ప్రజలు గుర్తెరగాలని ఆయన హెచ్చిరించారు. నేడు జగన్ పాలన పై విసుగు చెందుతున్న మెజార్టీ ఆంధ్రులు తిరిగి చంద్రబాబు వైపు చూడటం కూడా అతి పెద్ద ఘోరంగా భావించాలని, జగన్ అనుభవారాహిత్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయిస్తుంటే గత చంద్రబాబు అనుభవం ఢిల్లీ పార్టీలకు, మోది పాలనకు ఆంధ్ర భవిష్యత్ ను తాకట్టు పెట్టారని, ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధిస్తానని ఆంధ్రులను జగన్ నమ్మించి వంచించారని, చంద్రబాబు అయితే మోదికి ఫిదా అయ్యి ప్రత్యేక హోదా ఆవిరి చేసి ప్యాకేజి అంటు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో అవమానించి ఆంధ్రుల ప్రతిష్టను మంట గలిపారని, జగన్, చంద్రబాబు లు రాష్ట్ర అభివృద్ధి కన్నా వారి ఇరువురు ఆధిపత్యానికి పెద్ద పీట వేసుకుంటు అన్నపూర్ణ వంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేస్తున్నారని, ఈ తరుణంలో ఆంధ్రుల కర్తవ్యాన్ని జై ఆంధ్ర, సేవ్ ఆంధ్ర అంటు పిక్కటిల్లే లా ఢిల్లీ పెద్ద(గె)లకు,జగన్ చంద్రబాబు లకు వణుకు పుట్టించే విధంగా ఓటుతో సరికొత్త రీతిలో గుణపాఠం చెప్పాలని ఆయన తెలిపారు. ఆంధ్ర లో గల కార్పొరేట్ మీడియా వ్యవస్థలు ఆంధ్రులకు కేంద్రం చేస్తున్న ద్రోహం పైన గాని, హక్కులు ఉల్లంఘన పైన గాని, కనీస వసతులు, కనీస సౌకర్యాలు పైన గాని, సమ సమానత్వం పైన గాని, భారంగా మారుతున్న విద్యా, వైద్య రంగం పైన గాని, మహిళా రక్షణ, మహిళా సాధికారిత పైన గాని, కల్తీ ఆహార ప్రధార్థాల పైన గాని, నకిలీ నిత్యావసర సరుకుల పైన గాని, ధరలు పెరుగుదల పైన గాని, పర్యావరణ పరిరక్షణ పైన, దోచుకుని పోతున్న సహజ వనరులపైన గాని, అవినీతి నియంత్రణ, మెరుగైన పారిశుధ్యం పైన గాని, కాలుష్య రహిత పరిశుభ్ర మైన త్రాగు నీరు సరఫరా కోసం గాని, మెరుగైన పౌర సేవల కోసం గాని, పేదరిక నిర్ములన పరిస్థితుల పైన గాని, కుల మత రహిత సమాజ స్థాపన కోసం గాని, పిల్లలలో జాతీయ బావాలు కల్పించటం పైన గాని, ప్రస్తుతం కేద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కు చేస్తున్న మోసాల పైన గాని, ఎన్నికల హామీలను అమలు పరచటం పైన గాని చంద్రబాబు, జగన్ కార్పొరేట్ మీడియా వ్యవస్థలు దృష్టి సారించకుండా సినీ నటి సమంత విడాకులు కోసం, నానీల బూతు పురాణాల కోసం, పార్టీలను, సిద్ధాంతాలను సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టుకునే స్వార్థ నేతలకు కార్పొరేట్ మీడియా పెద్ద పీఠ వేస్తు వాస్తవాలను వెలుగు చూడనీయకుండ చేస్తుందని, చిన్న మీడియా వ్యవస్థలను ఉక్కుపాదంతో తొక్కేస్తుందని, ప్రజాజీవితానికి పనికిరాని అనర్హులైన కొంతమంది సినిమా నటులను నిశి రాత్రి వేళ రాజకీయ నేతలుగా మార్చేస్తున్న వైనం కార్పొరేట్ మీడియా దని, ఆంధ్రప్రదేశ్ సమస్యల కన్నా జగన్, చంద్రబాబు ల ఆధిపత్య పోరుకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి అడ్డుగా నిలుస్తున్నది జగన్, చంద్రబాబు మీడియా సంస్థల తప్పు కాదా అని ఆయన ప్రశ్నించారు.ఈ సారి ఆంధ్రుడి ఓటును నోటుకు కాదు, అభివృద్ధి కి అని చాటి చెప్పాల్సిన గురుతర భాద్యత ప్రతి ఆంధ్రుడి భుజస్కంధాల పైన వుందని, ఈ ధపా ఆంధ్రుడి ఓటు పార దర్శకంగాను, భాద్యతాయుతంగా, భావితరాల భవిష్యత్ కోసం మాత్రమే వినియోగించి ఆంధ్రుడి సత్తాని ఖండాతరాలు తెలియచేయాలని, హైదరాబాద్ లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటు ఆంధ్రాలో రాజకీయాలను శాసిస్తున్న చంద్రబాబు, జగన్ పార్టీలకు ప్రాంతీయ అభిమానం దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాలని, హైదరాబాద్ లో విలాశ జీవితాలను గడుపుతు కేసీఆర్ కు బాంచన్ దొర అంటు కేసీఆర్ కాళ్ళు మ్రొక్కుతు ఆంధ్ర రాజకీయాల్లో నర్తనశాల ల వలే తొడకొట్టడం కొంతమంది సినీ నటులకు పరిపాటిగా మారిందని, హైదరాబాద్, తెలంగాణా రాష్ట్రాల్లో ఈ సినిమా వాళ్ళు, ఆంధ్ర రాజకీయ పార్టీల ఉనికిని అక్కడ ఏమాత్రం చాటుకోరని, ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నట్టు తెలంగాణా ప్రజలను మోసం చేస్తే ఉరికించి ఉరికించి పరుగులు పెట్టిస్తారని, తెలంగాణా ఆంధ్రుల మధ్య ఎంతో సత్సంబందాలు గల పరిస్థితులు వున్నా రాజకీయ అవసరాలకు కేసీఆర్ లాంటి కొంతమంది అగాధాలు సృష్టిస్తు శాంతి భద్రతల సమస్యలుగా మారుస్తు రాజకీయ స్వప్రయోజనాలు పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ దఫా జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆంధ్రులు విప్లవాత్మకనైన చైతన్యంతో మోది కి భయపడే చంద్రబాబు, జగన్ లకు వ్యతిరేకంగా ప్రతి ఆంధ్రుడు ఓటును వినియోగించుకోవాలని, ఆంధ్రుడి ఓటు ఢిల్లీ పె(గె)ద్దల పంచెలు తడవాలని, ఆంధ్ర పై విషం కక్కుతున్న ఢిల్లీ పార్టీలకు ఆంధ్రులు చెంప పెట్టు వంటి తీర్పు నివ్వాలని, ఆంధ్ర ను కాపాడుకునే గురుతర బాధ్యత ప్రతి ఆంధ్రుడు చేతబూనాలని, జగన్, చంద్రబాబు పార్టీలను, వారి కార్పొరేట్ మీడియా వ్యవస్థలను ఆంధ్రులు బహిష్కరించిన నాడే ప్రత్యేక హోదా విభజన హామీలు సునాయాశంగా సాధించుకుంటామని,ఆంధ్రుల మార్పు తధ్యం, ఆంధ్రప్రదేశ్ సంపన్న రాష్ట్రం గా చరిత్ర పుటల్లో నిలవటం కాయమని, ఆంధ్రాలో ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం తధ్యం అని,ఆంధ్రాలో పెనుమార్పు ఖాయమని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సభకు ఆర్పిసి నగర సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, ఎండి హుస్సేన్,లంక దుర్గాప్రసాద్ , వల్లి శ్రీనివాసరావు, దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్, సిమ్మా దుర్గారావు, మోర్త ప్రభాకర్ , దుడ్డె త్రినాద్ , వల్లి వెంకటేష్, వాడపల్లి, మాసా అప్పాయమ్మ, జ్యోతిష్, మట్టపర్తి తులసి, కోమర్తి గోపి శ్రీనివాస్, సోర్ణపూడి మహేష్, మేడిచర్ల శ్రీనివాసరావు, కాకి శ్రీనివాస్, ఎస్ కె వల్లి , వానపల్లి విమల తదితరులు పాల్గొని యున్నారు.
-మేడా శ్రీనివాస్,MA, LLM, MA(Jour)
వ్యవస్థాపక అధ్యక్షులు
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
మొబైల్ : 9248777222