TV77తెలుగు రాజానగరం :
అంగన్వాడీ కేంద్రాల్లో జూలై 1 నుంచి ప్రత్యేక మెనూ అమలుకానుంది. రాజానగరం ఐసీడీఎస్ సీడీపీవో టి.నాగమణి మాట్లాడుతూ. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని రాజమహేంద్రవరం రూరల్, కడియం, రాజానగరం మండలాల పరిధిలో 304 అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు ఇప్పటికే తగు సూచనలు చేశామన్నారు. మెనూలో అన్నంతోపాటు విధిగా ఆకుకూరలు, బీరకాయ, దోసకాయ, టమోటా వంటి పోషకాలతో పప్పు, కోడిగుడ్డు కూర, ఉడికించిన కోడి గుడ్డు, సాంబారు అందిస్తారు.