రాష్ట్రం లో గ్రామ వాలంటీర్లు ద్వారా అభివృద్ధి సంక్షేమ ఫలా లు ప్రతీ ఇంటికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టాం : హోమ్ మంత్రి డా. తానేటి వనిత


 TV77తెలుగు చాగల్లు :

రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు ద్వారా అభివృద్ధి సంక్షేమ ఫలా లు ప్రతీ  ఇంటికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర  హోమ్ శాఖ మంత్రి  డా. తానే టి వనిత అన్నారు. శనివారం సాయంత్రం చాగల్లు మండలం బ్రాహ్మణ గూడెం గ్రామములో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహ న్ రెడ్డి మూడేళ్ల పాలన లో ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతు న్నాయని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.  చాగల్లు మం డలంలో గ్రామ పంచాయతీలకు  రీక్షాలను అందజేశారు. గడపగడపకు మన ప్రభుత్వం  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంక్షేమ  పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కుల మత రాజకీయాలకు అతీతం గా సంక్షేమ పథకాలు అందుతున్నాయని  తెలిపారు. లబ్ధి దారులు మూడేళ్ల అమలు చేసిన పథకాలు అభివృద్ధి గురించి అడిగి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,  ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ మట్టా వీరస్వామి ఆతుకూరి దొరయ్య గ్రామ సర్పంచులు ఎంపీటీసీ సభ్యు లు కొవ్వూరు నియోజకవర్గ నాయకులు బండి అబ్బులు ముదునురు నాగరాజు ఎం పీడీవో బి రామ్ ప్రసాద్ సచి వాలయం సిబ్బంది రెవె న్యూ అధికారులు తదితరులు పా ల్గొన్నారు.