గ్రేటర్ రాజమహేంద్రవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం - మార్గాని భరత్

 


TV77తెలుగు రాజమహేంద్రవరం :

రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ, పందిరి ఫంక్షన్ హాల్ నందు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్  అధ్వర్యంలో గ్రేటర్ రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్లీనరీ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రీజనల్ కోఆర్డినేటర్, పార్లమెంట్ సభ్యులు (రాజ్యసభ)  పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు  వేణు గోపాల కృష్ణ , హోం శాఖా మంత్రివర్యులు డాక్టర్ తానేటి వనిత, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు, రాజానగరం శాసన సభ్యులు  జక్కంపూడి రాజా, డిసిసిబి చైర్మన్  ఆకుల వీర్రాజు , రూరల్ కోఆర్డినేటర్  చందన నాగేశ్వర్ , గాండ్ల తెలికుల కార్పోరేషన్ చైర్మన్ సంకీస భవానిప్రియ ,రుడా చైర్ పర్సన్  షర్మిల రెడ్డి , నగర అధ్యక్షులు శ్రీ నందెపు శ్రీనివాస్, మాజీ బీసీ కార్పోరేషన్ చైర్మన్  పాలిక శ్రీనివాస్, జిల్లా ప్లీనరీ పరిశీలకులు వంకా రవీంద్ర , నగర పరిశీలకులు మొగలి బాబ్జీ  పాల్గొన్నారు. నియోజక వర్గం లో వార్డ్ ముఖ్య నాయకులు, వివిధ విభాగాల కార్పొరేషన్ల వైస్ చైర్మన్ లు, డైరెక్టర్లు, వివిధ సెల్ సభ్యులు,మాజీ కార్పొరేటర్ లు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సభాధ్యక్షులు గా ఎంపీ భరత్ మాట్లాడుతూ గడచిన 3 సంవత్సరాల సంక్షేమ పరిపాలనలో నవ రత్నాలు తో పాటు అనేక పథకాలను అర్హులైన ప్రజలకు అందచేశారు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిన సమయంలో కూడా ప్రజలకు అన్ని పథకాలను అందజేసిన ఘనత మన జగనన్న కే చెల్లింది అని ఎంపీ భరత్ అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అడుగు జాడలలో ప్రజల సంక్షేమం కొరకు ఒక్కడే ఎన్నో ఒడదుడుకులను ఎదుర్కొని 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని ప్రతిపక్షంలో వుండి ఎన్నో సమస్యలు ఎదుర్కొని, పోరాడి, ప్రజల మన్నలని పొంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఎనలేని సేవలు అందిస్తున్న మన జగనన్న కూడా మేమందరం అని ఎంపీ భరత్ తెలిపారు. టిడిపి పార్టీ ఇంక గేట్లు మూసివేసి సమయం వచ్చింది అని, వెన్నుపోటు పార్టీ కి తోడు దత్తపుత్రుడు ఒకరు అని, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వృధా ప్రయాస అని ఎంపీ భరత్ అన్నారు. తాను ఎంపీ గా గెలిచిన తరువాత నా స్థాయిలో ఎంత వరకు నగర అభివృద్ది చేశానో కళ్ళకు కనిపిస్తుంది అని, ప్రజలకు కూడా తెలుసు అని, రాబోయే రోజులలో మర్రిన్ని అభివృద్ది పనులకు ఈ సమావేశంలో తీర్మానాలను ప్రవేశ పెట్టి, ఇద్దరి మంత్రుల సహసహకారాలతో ముందరకు వెళ్తామని ఎంపీ భరత్ తెలిపారు. అలాగే మోరంపూడి జంక్షన్ ఫ్లై ఓవర్ విషయంలో నాది ఒకటే మాట అని, వచ్చే ఏడాది ఇదే తారీఖు లోపల ఫ్లై ఓవర్ పనులకు శంకుస్థాపన చేస్తాను అని, లేని పక్షంలో నా ఆస్తిని అమ్మి అయినా ఈ ఫ్లై ఓవర్ పనులకు శ్రీకారం చుడతానని ఎంపీ భరత్ అన్నారు. రాబోయే ఎన్నికలలో, అభివృద్ది విషయాలలో జిల్లా అధ్యక్షులు రాజానగరం శాసన సభ్యులు శ్రీ జక్కంపూడి రాజా సహాయ సహకారాలు తీసుకుంటాను అని ఎంపీ భరత్ అన్నారు.