TV77తెలుగు రాజమహేంద్రవరం రరూల్ :
భార్య , ఆమె ప్రియుడు లను అరెస్టు చేయాలి
దివాన్ చెరువు లో సంఘటన రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్. సమీప శ్రీ కృష్ణ పట్నం గ్రామాని కి చెందిన కమిడి ముత్యాలు(36)ను అతని భార్య వీరలక్ష్మి, ప్రియుడు రాజు హతుడు సోదరి బల్లంకి లక్ష్మి కలిసి కుట్రపన్ని హత్య చేసి ఆత్మహత్య గా సృష్టించారని హతుడు సోదరుడు కమిడి గోవిందు, సోదరి దుర్గ బంధువులు ఆరోపిస్తున్నారు. మేనకోడలు వరుసయ్యే వీరలక్ష్మి తో ముత్యాలకు పెళ్లి చేసామని, ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. కొంతకాలం క్రితం వీరలక్ష్మి కి దివాన్ చెరువు కు చెందిన రాజు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడిందని, దీనిపై భార్య భర్తల, బంధువుల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. వీరి మధ్య సయోధ్య చేశామని, అయితే తన పైన వేధింపుల కేసు బొమ్మూరు పోలీస్ స్టేషన్లో అక్రమంగా బనాయించినదని వాపోయారు. ఈ క్రమంలో గత నెలలో భార్యతో ప్రియుడు రాజు శారీరకంగా కలిసిన దృశ్యం చూడడంతో, భార్యాభర్తల మధ్య మరోసారి ఘర్షణ జరిగిందన్నారు. అదే రోజు అర్ధరాత్రి ప్రియుడు రాజుతో భార్య వీరలక్ష్మి మరో సోదరి బల్లంకి లక్ష్మి లతో కలిసి తీవ్రంగా కొట్టి మెడకు తాడు బిగించి, చేతులు వెనుకకు కట్టివేసి, మర్మావయవాలు చిధ్రం చేసి దారుణంగాహత్య చేశారని ముత్యాలు సోదరి పట్నాల దుర్గ, కమిడీ రాంబాబు, కమిడీ రాంబాబు కమిడీ గోవిందు లు ఇతర బంధువులు ఆరోపించారు. ఈ సంఘటనపై బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామని హత్య కేసు నమోదు చేయలేదని, పోస్టుమార్టం నివేదిక ఇవ్వడం లేదని కేసు విచారణను మరుగున ఫెడుతున్నారని ఆరోపించారు. నిందితులను అరెస్టు చేయాలని కోరుతున్న తమనే పోలీసులు బెదిరించి తిట్టి వెనక్కి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు బయట తిరుగుతూ చంపేసిన మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని బాధితులపై దాడులు చేస్తున్నారని వాపోయారు. హత్య కేసు నమోదు చేయాలని నిందితులను అరెస్టు చేయాలని, కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, పోస్టుమార్టం నివేదిక ఇప్పించాలని, వారు డిమాండ్ చేశారు.