స్నేహితుడు పుట్టిన రోజు వేడుకల్లో విషాదం


 TV77తెలుగు రాజమహేంద్రవరం  క్రైమ్ :

 హుకుంపేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అదుపుతప్పిన కారు విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.ధవళేశ్వరంలోని స్నేహితుని పుట్టిన రోజు జరుపుకొని విశాఖట్నంకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు ధవళేశ్వరంకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు.