TV77తెలుగు రాజమహేంద్రవరం :
ప్రెస్ నోట్,
జై ఆంధ్ర ఉద్యమ స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలి.
ఆంధ్రులు కళ్ళు తెరవకపోతే పాలనను సైతం ప్రయివేట్ పరం చేస్తారు.
ప్రభుత్వ విద్యా - వైద్యం ను రద్దు చేసే కుట్ర జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ సహజ వనరులకు ప్రమాదం పొంచివుంది.
ప్రభుత్వ బ్యాంక్ లను అంబానీ, ఆదానీ బ్యాంక్ లుగా దారాదత్తం చేయుటకు మోది సర్కార్ ప్రణాళికలు రచిస్తుంది తశ్మాత్ జాగ్రత్త అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేసే కేంద్ర పార్టీకే జగన్ పార్టి మద్దతు వుంటుందని, అవసరమనుకుంటే హోదా సాధన కోసం మా పార్లమెంట్ సభ్యులు రాజీనామాలకు సైతం సిద్ధమని గతం నుండి ప్రకటించుకున్న వైఎస్సార్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు అందుకు బిన్నంగా హోదా, విభజన హామీల అమలు సాధ్యం కాదు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వం అని పచ్చిగా ఆంధ్రులను మోసం చేస్తున్న మోది సర్కార్ కు జగన్మోహన్ రెడ్డి బాసటగా నిలవటం ద్రోహం కాదా ! ఆంధ్రప్రదేశ్ సహజ వనరులను తరలించుకుపోతున్నారని, ఆంధ్రప్రదేశ్ లో గల ఓడరేవులను,ప్రభుత్వ రంగ సంస్థలను గుజరాత్ సంపన్నులకు, విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా దారాదత్తం చేయటం ప్రజా ద్రోహం కాదా అని, ఆంధ్రప్రదేశ్ సంపదను దోచుకుంటు రాష్ట్రాన్ని పిప్పు పిప్పు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవటం జగన్మోహన్ రెడ్డికి తగదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై గుజరాత్ సాక్షిగా కాలకూట విషం చిమ్ముతున్న మోది, ఎన్డీఏ సర్కార్ రాష్ట్రపతి అభ్యర్థి అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము ను సమర్ధించటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేయటమేనని, రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే కీలక ప్రక్రియలో కూడా ప్రత్యేక హోదా విభజన హామీల అమలుకై మోది సర్కార్ పై ఒత్తిడి పెంచకపోవడం అనేక అనుమానాలకు తావునిస్తుందని, మోది సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆకలి రాష్టంగా మార్చటమే ప్రధాన లక్ష్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు. రాష్ట్ర అభిమానాన్ని, ప్రాంతీయతను చాటుకోవటంలో తమిళనాడు ప్రజలను, తెలంగాణా ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాలకు, ఆత్మగౌరవానికి బిన్నంగా ఆ రాష్ట్ర పాలకులు, నేతలు వ్యవహరిస్తే ఆ రాష్ట్ర ప్రజలు నేతల తాట తెస్తారనే భయం ఆ రాష్ట్ర నేతల్లో వుంటుందని, తెలంగాణా రాష్ట్ర సాధనలో కేసీఆర్ తప్పటడుగులు వేద్దాం అని చుసిన ఘటనలో తెలంగాణా ప్రజలు కేసీఆర్ ను హెచ్చిరించి చక్కగ ఉంచటంలో తెలంగాణా ఉద్యమ కారులు సఫలీకృతులైయ్యారని, ప్రత్యేక రాష్ట్రం సాధించుకో గలిగారని,అదే విధంగా యావత్ భారతదేశం గర్వపడే మహోన్నత ఉద్యమ చరిత్ర ఆంధ్రప్రదేశ్ సొంతం అని, సుమారు 50 ఏళ్ళు క్రితమే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉవ్వెత్తున ఉద్బవించిన ఉద్యమం జై ఆంధ్ర ఉద్యమం అని, ఆ ఉద్యమం చరిత్ర గర్వపడే గొప్ప ఉద్యమం అని, ఆ నాటి ఉద్యమానికి తెన్నిటి విశ్వనాధం, గౌతు లచ్చన్న, కాకాని వెంకటరత్నం వంటి ఎందరో గొప్ప గొప్ప వీరులు ప్రత్యేక రాష్ట్రం కోసం జై ఆంధ్ర అంటు ఢిల్లీ పెద్దలకు ఒణుకు పుట్టించారని, కొన్ని రాజకీయ శక్తుల నమ్మక ద్రోహానికి ఆ నాడు జై ఆంధ్ర ఉద్యమం చల్లపడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను కోల్పోవలసి వచ్చిందని, ఎంతో ముందు చూపుతో 50 ఏళ్ల క్రితం జై ఆంధ్ర అంటు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తే కేంద్ర బలగాలు సుమారు 500 మందికి పైబడి జై ఆంధ్ర ఉద్యమకారులు తుపాకీ తూటాలకు అసువులు బాశారని, జై ఆంధ్ర ఉద్యమం లో వృద్దులు, మహిళలు సైతం ఎంతో కీలక పాత్ర పోషించి ఆంధ్రుల పౌరుషాన్ని ఢిల్లీకి తాకించారని , నేడు అదే స్ఫూర్తితో జై ఆంధ్ర, సేవ్ ఆంధ్ర అంటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను, మన బిడ్డల భద్రతను కాపాడుకోవాల్సిన గురుతర భాద్యత ప్రతి ఆంధ్రుడి కర్తవ్యంగా భావించాల్సిన భాద్యత ఆంధ్రుల భుజస్కందాలపై వుందని ఆయన తెలిపారు . ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవటానికి ఆంధ్రులు తక్షణమే మేలుకోవాలని, మరో మారు ఓటరు అజాగ్రత్తగా వుంటే భారతదేశం యొక్క పాలనను విదేశి శక్తులకు, అంబానీ, ఆదానీలకు అప్పగించి బ్రిటిష్ పాలనను తలపించే ప్రమాదం తెచ్చిపెడతారని , భారతదేశాన్ని పాలిస్తున్నట్టు ప్రధాని మోది భారతీయులను నమ్మిస్తున్నారని, వాస్తవానికి అంబానీ, ఆదానీల చేతులో మోది కీలుబొమ్మ అయితే మోది చేతులో ఆంధ్ర పాలకులు కీలుబొమ్మ గా నడుస్తున్నారని, మన పాలకుల అవినీతి బలహీనతలకు ఆంధ్రప్రదేశ్ ఘోషిస్తుందని, ఆంధ్రుల మౌనం ఆంధ్రప్రదేశ్ కు అత్యంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని, బలహీనతలు లేని పాలకులు, నేతలు ఆంధ్రప్రదేశ్ కు ఎంతైనా అవసరం వుందని, ఆంధ్రప్రదేశ్ సహజవనరులన్ని మోది రాజకీయ అవసరాలకు గుజరాత్ తరలించుకు పోతున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలను, ఓడ రేవులను విదేశి, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేస్తున్నారని, పట్టభద్రులను రోజు కూలీలుగా మార్చే ప్రణాళికలు మోది సర్కార్ రచిస్తుందని, ఆంధ్రప్రదేశ్ లో గల లక్షల కోట్లు విలువైన సహజ వనరులను మోది సర్కార్ దోచుకుంటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయటంలో ఉద్దేశ్య పూర్వకంగా తాత్సారం చేస్తున్నారని, మోది సర్కార్ ఆంధ్రప్రదేశ్ పై కక్ష గట్టిందని, మోది సర్కార్ కు ఆంధ్రులు బుద్ది చెప్పే రోజులు ఆసన్నమైనవని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ లో మోది సర్కార్ ప్రభుత్వ విద్యా వైద్యం ను రద్దుచేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని, మోదికి భయపడటానికి ఆంధ్రప్రదేశ్ పాలకులు ముందువరసలో వుంటారని, ముందు ముందు అంబానీ, ఆదానీలకు బ్యాంక్ రుణాలతో అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వ బ్యాంక్ లను అంబానీ, ఆదానీలకు ప్రయివేట్ పరం చేసే విధంగా పాచికలు రచిస్తున్నారని, లక్షల కోట్లు బ్యాంక్ లకు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన ఆర్ధిక నేరగాళ్ల నుండి వేలకోట్లు బిజెపి పార్టి నిధులుగా వసూలు చేసుకుని భారత్ ఆర్ధిక పతనానికి కారకులైతున్నారని, భారత్ అత్యంత సంపన్న దేశం అని రాజకీయ అవినీతి కుంభకోణాల కారణంగా శ్రమ దోపిడి తో పాటుగా వ్యవస్థను అస్థిర పరుస్తున్నారని, మోది సర్కార్ భారతదేశం కు అత్యంత ప్రమాదంగా భావించాలని, బిజెపి కి వంత పాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముసుగు మాయలో ప్రజలను మోసం చేయుటకు కుట్రలు చేయుటకు ప్రయత్నాలు సాగిస్తున్న కొన్ని ఇతర పార్టీల పట్ల ఆంధ్రులు అప్రమత్తంగా వుండాలని,ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేలుకోక పొతే భవిష్యత్ లో ఆంధ్ర ఎడారిగా మారుతుందని, మన బిడ్డలు భవిష్యత్ కోసం ఆంధ్రులు జై ఆంధ్ర ఉద్యమ స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం తప్పదని, నేటి పాలకులతో అభివృద్ధి సాధ్యం కాదని, ప్రజలను బిచ్చగాళ్లగా మార్చటమే మన పాలకుల రహస్య అజెండా అని, విప్లవాత్మకమైన మార్పు ఆంధ్రుల తోనే సాధ్యం అని,ఆంధ్రుడిగా జీవిద్దాం, ఆంధ్రుడిగా మరణిద్దాం, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతి ఆంధ్రుడు ప్రతీకగా నిలుద్దాం రండి తరలి రండి అని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సభకు పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, లంక దుర్గా ప్రసాద్,కాసా రాజు, వల్లి శ్రీనివాసరావు,వర్ధనపు శరత్ కుమార్, సిమ్మా దుర్గారావు, పెండ్యాల నిరంజన్ ప్రదీప్, పెండ్యాల సత్య ప్రవీణ్ మేడిచర్ల శ్రీనివాసరావు, మట్టపర్తి తులసి, మాసా అప్పాయమ్మ, మార్త ప్రభాకర్వ, నుం సతీష్, మండవల్లి వెంకటేశ్వరరావు, మండవల్లి శంకర్,మండవల్లి సూరిబాబు, ఉండమట్ల విజయరాజు, ఉండమట్ల కుమారి, చామకూరి నాగేశ్వరి, మెండి ప్రకాశం, తదితరులు పాల్గొనియున్నారు.
జై ఆంధ్ర - సేవ్ ఆంధ్ర -మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్