TV77తెలుగు
తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు రేపు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రెండు రాష్ట్రాల్లో సోమవారం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు రాబోయే 2 రోజుల్లో పశ్చిమ ద్వీపకల్ప తీరం వెంబడి తీవ్రమైన వర్షపాతం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, సబ్-హిమాలయన్లో భారీ వర్షపాతం 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది..