TV77తెలుగు తిరుమల :
తిరుమల మొదటిఘాట్‌లో గురువారం ఓ కారు బోల్తా పడింది. చెన్నైకి చెందిన భక్త బృందం శ్రీవారి దర్శనం పూర్తిచేసుకుని తమ కారులో తిరుగు ప్రయాణమైంది. అలిపిరికి సమీపంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ వాహనంలోని ముగ్గురు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.