48 గంటల్లో రాష్ట్రాన్ని తాగుతున్న రుతుపవనాలు


 TV77తెలుగు అమరావతి:

 నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో రాష్ట్రాన్ని తాకనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రతికూల వాతావరణం కారణంగా నైరుతు రుతు పవనాలు మెల్లగా కదులుతున్నాయి. రానున్న 48 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, కొంకణ్‌ లోని మిగిలిన ప్రాంతాల్లోకి, గుజరాత్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, మొత్తం కర్ణాటక మరియు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలోని మరికొన్ని ప్రాంతా లలోకి రెండు నుండి మూడు రోజులలో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతూ ఉంటాయని తెలిపింది. దక్షిణ ప్రాంతాన్ని రుతుపవనాలు తాకుతాయని ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు.