TV77తెలుగు రాజంపేట :
అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం ఎస్‌ఆర్.పాలెం అటవీప్రాంతంలో పోలీసుల కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ లో భాగంగా 21 మంది ఎర్రచందనం తమిళ కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 22 గొడ్డల్లు, 2 రంపాలు, 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.