నా పాదయాత్రతో టీఆర్ఎస్ కు చెమటలు పడుతున్నాయ్:షర్మిల


 TV77తెలుగు హైదరాబాద్ : 

తన పాదయాత్రతో టీఆర్ఎస్‌ కు చెమటలు పడుతున్నాయని వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల  పేర్కొన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవన్నారు. తన పాదయాత్ర తెలంగాణ మొత్తం ఆరు నెలల పాటు కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ కు ముందస్తుకు వెళ్లే ధైర్యం లేదన్నారు. ప్రజల నుంచి తమకు బలమైన మద్దతు వస్తోందన్నారు. ప్రజల కోసమే తాను పాదయాత్ర చేస్తున్నానని వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నేడు లోటస్ పాండ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నడిచింది తానే అయినా.. నడిపించింది మాత్రం ప్రజలే అన్నారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. వైఎస్సార్‌ని ప్రజలు మరిచిపోలేదన్నారు. షర్మిలను ఆదరిస్తున్నారంటే.. అది వైఎస్సారే కారణమన్నారు. రూ.860 కోట్ల రూపాయలు టిఆర్ఎస్  పార్టీ అకౌంట్‌లో ఉంటే.. ఆ పార్టీ నేతల అకౌంట్లో ఇంకా ఎన్ని ఉంటాయని ప్రశ్నించారు. ఖజానా ఖాళీ కావడం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. పెట్టుబడులు వస్తే నిరుద్యోగ సమస్య ఎందుకు తీరడం లేదన్నారు. డబ్బులు ఉన్న వారికే రాజ్యసభ పదవులు ఇస్తున్నారని షర్మిల పేర్కొన్నారు.