వారంపాటు జాగ్రత్త


 TV77తెలుగు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల సాధారణం కంటే 3-5

డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. నిన్న

తాడేపల్లిగూడెంలో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత

నమోదైంది. గాలిలో తేమ శాతం తగ్గడంతో తీవ్ర

వేడి వాతావరణం ఉంటోంది. ఎండ, వడగాల్పులు,

ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోహిణీ

కార్తె మొదలవడంతో మరో వారం రోజులపాటు

ఎండలు ఎక్కువగానే ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని

 అధికారులు సూచిస్తున్నారు.