నేరపరిశోధన ను సాధారణ పోలీస్ నుండి ప్రత్యేక పోలీస్ లకు బదలాయించాలి.


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

కిరాయి సాక్షుల ప్రక్రియకు స్వస్తి చెప్పి వాస్తవ సాక్షులను ప్రోత్సహించాలి. 

మెరుగైన విచారణ పద్దతులను అమలు పరచాలి. 

పెద్దోళ్ళను తాకితేనే రాజద్రోహం నేరం రద్దు కాబడిందా !

న్యాయవాదులు,జర్నలిస్టులు రక్షింప బడితేనే సమాజం రక్షింప బడుతుంది. 

బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా భారతదేశంకు మరో రాజ్యాంగ అధ్యయనం జరగాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నేటి పాలకుల స్వార్థప్రయోజనాలకు సాధారణ పోలీస్ వ్యవస్థ పూర్తిగా కలుషితం అయిపోయిందని, శాస్త్రీయపరమైన నేరపరిశోధన ను సమూలంగా మరిచిపోయారని, పోలీస్ విధులు అంటే పాలకుల దయా దాక్షణ్యాలపై బ్రతకాల్సిందే నన్నట్టు వుందని , నేటి సామాజిక పరిస్థితులు ప్రస్తుత పాలకుల మూలానే బ్రష్టు పడుతున్నాయని,అవినీతి మైయమైన పాలనా అధికారం ప్రభుత్వ ఉద్యోగి ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని, ప్రస్తుత ఉద్యోగ యంత్రాంగం చెప్పులు మోసే విధులు మాత్రమే నిర్వహిస్తున్నారని, పౌర సేవలు మరిచిపోయి ప్రజలను కాసులు కోసం పీడించుకు తింటున్నారని, నేటి ఉద్యోగ సేవకులను సొంత కుటుంబ సభ్యలే అసహ్యించుంటున్నారని, ఏ వైట్ కాలర్ నేరస్తులనైనా శిక్షించే దమ్మున్న ఇన్వెస్టిగేషన్ చేయగల సత్తా వున్న  ఉద్యోగి నేడు ఉన్నారా అని, అనాదిగా పేకాట ఆడేవారిని, విటులను మాత్రమే పట్టుకుని సంఘ విద్రోహులకు సలాం చేస్తు రాజ్యాంగ భద్రతను అపహాస్యం చేస్తున్నారని,   ఇన్వెస్టిగేషన్ మమా అనిపిస్తు న్యాయవ్యవస్థను ప్రక్కదారి పట్టిస్తున్నారని,కొంతమంది  సాధారణ పోలీస్ అసమర్ధత కారణంగా జరిగిన నేరం న్యాయస్థానాల్లో  వీగిపోతున్నాయని,  ప్రస్తుతం శృతి మించిన అధికారం కారణంగా నేరస్తులు బయట సమాజాన్ని శాసిస్తున్నారని, సామాన్య పౌరులు బిక్కు బిక్కు మంటు జీవిస్తున్నారని, ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా అవి అవినీతికి మార్గం చేసుకుంటు చట్టాలను అవహేళన చేస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు.రాజ్యాంగ హక్కులు రోజు రోజుకు నిర్వీర్యం అయిపోతున్నాయని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ప్రతి నిత్యం అన్ని రాజకీయ పక్షాలు మోసం చేస్తున్నాయని, కాలం చెల్లిన చట్టాలను నేటికి అమలు చేయటం ప్రజల దురదృష్టం అని, రాజ్యాంగంలో ఆర్టికల్ 20 నుండి 26 వరకు నిత్యం తుంగలో తొక్కుతున్నారని, ప్రాధిమిక హక్కులు చదువుకోవటానికి మాత్రమే పనికొస్తున్నాయని, పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం గా చెప్పుకుంటున్నామని, అమలైతున్న పాలన మాత్రం పస్తుం పెర్షియన్ పాలన వలే సాగుతుందని, సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యతిరేకించిన పౌరులపై రాజద్రోహం కేసులు నమోదు చేసి మానవ హక్కులను కాలరాస్తున్నారని, ఆర్టికల్ 14 వెబ్ పోర్టల్ అధ్యయనం ప్రకారం 2010-14 మధ్య దేశ వ్యాప్తంగా 3762 మందిపై  కేసులు బనాయించి మొత్తంగా 279 రాజద్రోహం కేసులు నమోదయ్యాయని, తరువాత 6 ఏళ్ళులో 519 కేసులు నమోదు చేసి 7136 మందిపై అభియోగాలు నమోదు చేసారని, 2015-20 సంవత్సరం మధ్యలో 548 మందిపై అభియోగాలు మోపితే 12 మందిపైనే నేర ఆరోపణలు రుజువయ్యాయని అస్సాం, కర్ణాటక, నాగాలాండ్, యుపి, ఏపి, తెలంగాణా రాష్ట్రాల్లో అధికంగా సెక్షన్ 124(A)రాజకీయ ప్రయోజనాలకు దుర్వినియోగం అయితుందని ఆయన పేర్కొన్నారు. ఎక్కువగా 124(A) సెక్షన్ పాలకుల లోపాలను ఎత్తి చూపుతున్న మీడియా ప్రతినిధులు, విలేఖరులపైన, న్యాయవాదులు పైన, ప్రధాన రాజకీయ విపక్షాలపైన, ఉద్యమ కారులపైన సొంత రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని, చట్టాలను భాదిత ప్రజలకు రక్షణగా కాకుండా సామాన్య ప్రజలను, భాదితులను క్షోభకు గురిచేయటానికే ఐపిసి సెక్షన్లు అధికార దుర్వినియోగానికి బలైతున్నాయని కొన్ని నల్ల చట్టాలు భారత ప్రజల మనుగడకే తీవ్ర ప్రమాదం అని,నేడు చట్టబద్దమైన హక్కు సామాన్యులకు అందని ద్రాక్షగా వుందని, ఐపిసి 124(A) సెక్షన్ తో పాటుగా కాలం చెల్లిన అనేక సెక్షన్లు పాలనా విధానాలకు శాపంగా మారాయని, 124(A) సెక్షన్ ను రద్దు చేయటానికి సుమారు నేటికి 100 ఏళ్ళు పట్టిందని, బ్రిటిష్ వాళ్ళ సౌలభ్యం కోసం భారతీయులను హింసించటానికి తెల్లవాళ్లు ప్రవేశ పెట్టిన ఈ చట్టం రద్దు చేయటానికి ఒక శతాబ్ద కాలం పట్టి నందుకు నేటి పాలకులు సిగ్గుపడాలి అని, ఈ నల్ల చట్టాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రద్దు చేసినందుకు స్వచ్ఛమైన భారతీయులు వారిని అభినందిస్తున్నారని ఆయన అభివర్ణించారు. 124(A)సెక్షన్ రద్దు చేయటం సాహుసోపేతమైన నిర్ణయం అని, ఇప్పటికి 100 ఏళ్ల క్రితం మహాత్మాగాంధీ పై తెల్లదొర పాలకులు 124 సెక్షన్ ప్రకారం రాజద్రోహం కేసు నమోదు చేసారని, 1922 సం వత్సరం లో అహ్మదాబాద్ కోర్టులో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పై విచారణ జరిగిందని, రాజద్రోహ చట్టం న్యాయం పై అత్యాచారం వంటిదని పేర్కొంటు 1929 సంవత్సరం లో గాంధీ దేశ వ్యాప్తంగా నిరసన గళం వినిపించారని, ఇప్పటికి బ్రిటిష్ చట్టాలను అమలు చేస్తు భారతీయులను హింసిస్తున్న పాలకులకు పాలించే అర్హత లేదని, ఒక నల్ల చట్టాన్ని రద్దు చేయటానికి 100 ఏళ్ళు పడితే మిగిలిన కాలంచెల్లిన కొన్ని చట్టాలను రద్దు చేయటానికి కలియుగం అంతరించి పోతుందా  ! యుగాంతం సంబవిస్తుందా అని, సిగ్గు లేని, చేవలేని, అవినీతి పాలకులు సామాన్యుల రక్తాన్ని "డెంగ్యూ" దొమవలే పీల్చేస్తు ప్రజలను ఆర్ధికంగా దోచుకుంటున్నారని,సిగ్గులేకుండా చరిత్ర హీనులుగా పాలకులుగా చలామణి అయ్యే కన్నా రాజకీయ సన్యాసం తీసుకుని చివరి దశలో నైనా ప్రజలు చేత కీర్తింప బడేలా బ్రతకాలని, ఎంపి రఘురామ్ కృష్ణం రాజును తాకితేనే 124 సెక్షన్ కు విముక్తి కలిగిందా అని ఆయన సూచించారు.లోపభూష్ట మైన చట్టాలు అమలు జరుగుతున్న నేపథ్యంలో నేడు శిక్షలు అనుభవిస్తున్న వారు గాని, ఆరోపణలు ఎదుర్కొంటున్న పౌరులు గాని అమాయకులా ! నిజమైన దోషులా ! అనేది వంద యుగాల ప్రశ్న అని,కొంతమంది  సాధారణ పోలీసులకు  నేరపరిశోధనలో కనీస పరిజ్ఞానం కూడా లేదని, అక్రమంగా సృష్టించుకున్న  నేరాలపైనే నేటి పాలకులు, అధికారులు  రివ్యూలు నిర్వహిస్తు అసలు నేరస్తులకు గులాం గిరి చేస్తున్నారని, ప్రతి ఇన్వెస్టిగేషన్ లోను కిరాయి సాక్షులు తోనే నేర విచారణ సాగటం ఆటవిక పాలనగా భావించాలని,ఆసుపత్రి రిపోర్టుల నుండి పరికరాలను సేకరింపు వరకు అన్ని సృష్టించుకుంటున్నవే నని, ఈ తరహా విచారణ కారణంగా న్యాయస్థానాల్లో కేసులు వీగిపోతున్నాయని, నేరస్తులు సమాజంలో సమాంతర మాఫియాను శాసిస్తున్నారని, రౌడీయిజాన్ని వృత్తిగా చేసుకున్న వారిపై నిఘా పెట్టకుండా,వారిపై రౌడి షీట్లు తెరవకుండా  రాజకీయ ఉద్యమ కారులపై రౌడి షీట్లు తెరుస్తున్నారని, నేరపరిశోధ విభాగాన్ని ప్రత్యేక పోలీస్ విభాగానికి బదలాయించాలని, సాధారణ పోలీస్ లకు ప్రాధిమికంగా  ఎఫ్ ఐ ఆర్ దాఖలు అధికారం మాత్రమే వుండాలని, పూర్తి స్థాయి నేర పరిశోధనకు సంబంధించి ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ పోలీస్ విభాగం వుండాలని, శాస్త్రీయమైన పరిశోధన కేంద్రాలు ప్రతి జిల్లా కేంద్రంలోను నియనించాలని, కొన్ని ప్రత్యేక కేసులను విచారించటానికి జ్యుడీషియరీ పోలీస్ విభాగాన్ని అమలు పరచాలని, సి సి ఫుటేజిల పర్యవేక్షణ కు ప్రత్యేక నిధులు కేటాయించి నిరంతరం విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని, కాలయాపన లేని సమాచార హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని, ప్రభుత్వ విధులు పక్కాగా అమలు జరిగే విధంగా పాలకులు దృష్టి సారించాలని,నేరస్తులకు చట్టం శిక్షిస్తుందనే భయాన్ని పాలకులు కల్పించాలని, పౌరులు భద్రతగా జీవించే విధంగా మెరుగైన పాలన అమలు జరగాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు. సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి నాయకులు సర్వశ్రీ డివిఆర్ మూర్తి,కాసా రాజు  ఎండి హుస్సేన్, వల్లి శ్రీనివాసరావు, దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్, మండవిల్లి సూరిబాబు, మండవిల్లి శంకర్, మండవిల్లి వెంకటేశ్వరరావు, మట్టపర్తి తులసి రావు, ముక్కామల సాయి కుమార్ శర్మ, కోమర్తి గోపి శ్రీనివాస్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, సీరపు నాగేశ్వరి, వానపల్లి విమల, రెడ్డి స్వర్ణలత, కోట సుశీల తదితరులు పాల్గొనియున్నారు. 

మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్