TV77తెలుగు రాజమహేంద్రవరం :
అందరి సహకారంతోనే బహిరంగ సభ జయప్రదం అయింది...
పత్రికా ప్రకటనలో తెలియజేసిన జక్కంపూడి రాజా.
రాజమహేంద్రవరం మున్సిపల్ స్టేడియం గ్రౌండ్ నందు శుక్రవారం నాడు సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించేఉద్దేశ్యంలో భాగంగా రాష్ట్రానికి చెందిన 17 మంది మంత్రుల బృందంతో చేపట్టిన బహిరంగ సభలో బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ ప్రజలు,వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, పాల్గొని సభను విజయవంతం చేసారని ఇందుకు సహకరించిన పార్టీ గ్రామ,మండల,స్థాయి నాయకులకు,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీస్సులు అభిమానంతోనే సభ జయప్రదం అయిందన్నారు. ప్రజల యొక్క దీవెనలు, ప్రేమానురాగాలు ఎల్లప్పుడు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలని,అందరి సహకారం పొందుతూ భవిష్యత్తులో ముందుకు వెళ్తామని ఆయన తెలియజేశారు.