మల్కారం చెరువులో ఇద్దరు పిల్లలు మృతి


 TV77తెలుగు మేడ్చల్:

మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పీఎస్ పరిధిలో విషాదఘటన చోటుచేసుకుంది. మల్కారం చెరువులో ప్రమాదవశాత్తు ముగ్గురు చిన్నారులు పడగా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో బాబుని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.