మరో రెండు రోజుల్లో వర్షాలు


 TV77తెలుగు  చెన్నై:

 తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో, డెల్టా జిల్లాలు, పశ్చిమ కనుమల సరిహద్దు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీవర్షాలు, ఈ నెల 10,11 తేదీ ల్లో తిరుప్పూర్‌, కోయంబత్తూర్‌, నీలగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతా ల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొం ది. రాజధాని నగరంలో చెన్నై ఆకాశం కొంత మేఘావృతంగా ఉంటుందని, వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ కేంద్రం తెలియజేసింది.