TV77తెలుగు కొవ్వూరు:
ఆదివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐశ్వర్య రాస్తోగి కొవ్వూరు లోని హోం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి డా. తానేటి వనిత ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్బంగా నూతన జిల్లా ఏర్పాటు నేపథ్యంలో జిల్లాలో భద్రతా పరమైన అంశాలు , నూతన ఎస్పీ కార్యాలయం ఏర్పాటు, పోలీస్ సిబ్బంది , హోమ్ గార్డ్ లు వివరాలతో పాటు తదితర విషయాలు పై మంత్రి ఎస్పీ తో చర్చించడం జరిగింది. ఎస్పీ వెంట కొవ్వూరు డిఎస్పీ బి. శ్రీనాథ్, పలువురు పోలీస్ అధికారుల ఉన్నారు.