TV77తెలుగు రాజమహేంద్రవరం :
కుల మంత్రులు వద్దు - సామాజిక మంత్రులు ముద్దు.
కుల సమీకరణలతో మంత్రి వర్గ విస్తరణ ప్రజలకు ప్రమాదం.
ఏపిలో మంత్రులకు ప్రాధాన్యత లేదు.
ఏపిలో పేరుకే మత్రులకు శాఖలు పాలన అంతా అదృశ్య శక్తులే .
కుల సమీకరణలతో మంత్రివర్గం కులాలను దోచుకోవటానికేనా ! అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఎద్దేవా చేసారు.కులాల వారిగా మంత్రులను ప్రకటించి ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ద్రోహం చేసారని, సామాజిక పాలన ముసుగులో కులాలకు మంత్రి బ్యాడ్జిలు తగిలించటం దారుణమని, కుల సామాజిక వర్గం తో మంత్రులుగా ప్రమాణం చేసిన ఏ ఒక్క మంత్రి అయినా ఆ కులంలో వున్న మెజార్టీ పేదరికాన్ని తుడిచి సంపన్నులుగా తీర్చి దిద్దుతాను అని చెప్పగలిగే దమ్మున్న మంత్రి ప్రస్తుత మంత్రి వర్గంలో వున్నారా ! కులం ముసుగులో సంపదను దోచుకోవటం తప్ప సామాజిక అభివృద్ధి కి దోహద పడగలరా అని, చట్టబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి కుల మంత్రులుగా ప్రకటించుకోవడం సిగ్గుమాలిన చర్య అని, ఈ తరహా మంత్రి వర్గ విస్తరణ కారణంగా సామాజిక అభివృద్ధి కుంటుపడుతుందని, మంత్రి హోదా ప్రజలకు ఆ శాఖకు భరోసాగా వుండాలని, అంతేగాని భారంగా వుండరాదని, ప్రస్తుత మంత్రులు జీతాలు తీసుకోవటానికి, ప్రోటోకాల్ పొందటానికి, ప్రజల శ్రమను దోచుకోవడానికి మాత్రమే మంత్రి హోదాను అనుభవిస్తున్నారని,భాద్యతా హితమైన సేవలు చేయగల మంత్రులు లేకపోవటం ప్రజల దురదృష్టం అని, కుల స్టిక్కర్లతో ఏపిలో మంత్రులు వద్దని, సామాజిక భాద్యత గల మంత్రులే ముద్దు అని ఆయన కోరారు. ఓట్ల రాజకీయాలకు ప్రజాస్వామ్యాన్ని బ్రష్టు పట్టించవద్దని, కుల మత రహిత సేవలు అందిస్తాను, పక్షపాతం, బలహీనతలకు తావు లేని చట్టబద్దమైన సేవలు అందిస్తాను అని రాజ్యాంగ బద్దంగా ప్రమాణం చేసిన మంత్రులు కుల మంత్రులుగా ప్రచారం పొందటం దారుణమని, గవర్నర్ సాక్షిగా చట్ట వ్యతిరేక చర్య కదా అని, ఏ నాయకుడికి ఒక కులం వారు ఓట్లు వేయరని, అన్నివర్గాల వారికి అండగా వుంటారు, న్యాయం చేస్తారు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు అనే ఒకే ఒక్క నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తుంటే గెలిచిన నేత పాలు త్రాగుతు రొమ్ముగుద్దే రోత పాలనకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారని, సొంత కులం అభివృద్ధి ని, ఆ నిధులను తన స్వార్థానికి దోచుకుంటున్నారని, ప్రజలను ఓటుకు నోటుకు బానిసలను చేస్తు మరోపక్క సొంత కులాల్లో వివాదాలు సృష్టిస్తు రాజకీయ లబ్ది పొందుతున్నారని, ప్రతి కుల నాయకుడు దోచుకోవటం, దాచుకోవటం తప్ప మెరుగైన పాలన పై దృష్టి సారించటం లేదని,మంత్రి గారు వున్న ప్రాంతంలో సొంత కులంలో కడుపేదరికం వున్నవారు ఎందుకంటున్నారో ప్రజలు ఆలోచించిన నాడు ఈ కుల నేతల అడ్రస్ లు గల్లంతవ్వటం ఖాయమని ఆయన హెచ్చిరించారు. కుల మంత్రులు కారణంగా ఆ ఆ కులాలు సంపన్నులుగా ఎదుగుతున్నారా అంటే అలాంటిదేమి లేదని, డా. బి ఆర్ అంబేద్కర్ ను బూచిగా చూపిస్తు ప్రధాన రాజకీయ పాలక పార్టీలు ఆ మహనీయుడును మోసం చేస్తున్నాయని, స్వాతంత్ర్య అనంతరం 75 ఏళ్లుగా రాజ్యాంగాన్ని ధనిక వర్గాల అభివృద్ధికి తూట్లు పొడుస్తూనే వున్నారని,రాజ్యాంగ హక్కులను, ఫలాలను పేదవానికి అందని ద్రాక్ష గానే మిగిల్చారని, రాజ్యాంగాన్ని ఆర్ధిక నేరగాళ్లు రామఫలంగా బుజిస్తూ పేదోడి వెన్నును ముక్కలు చేస్తున్నారని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు అక్రమార్కులకు, కార్పొరేట్ సంస్థలకు మెత్తని దిండు వలే ఉపయోగపడుతుందని, పేదోడు రాజ్యాంగాన్ని భగవద్గీత, ఖురాన్, బైబిల్ వలే పూజిస్తుంటే పాలకులు రాజ్యాంగాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని, రాజ్యాంగ స్ఫూర్తి సమానంగా ఉన్నప్పటికీ రాజ్యాంగ హక్కులు సమానంగా అమలు కావడం లేదని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు ప్రాధాన్యత లేదని, ప్రస్తుత మంత్రులు విజిటింగ్ కార్డు మంత్రులని, బుగ్గ కారులో జల్సాగా తిరగటం తప్ప సంబంధిత మంత్రిత్వ శాఖకు ఏ మేలు చేయలేకపూతున్నారని, మంత్రి అసమర్ధతను చాటుకుంటున్నారని,మంత్రి స్థానానికి న్యాయం చేయలేక నెల జీతాలు తీసుకుంటు అవినీతికి, కుంభకోణాలకు, అక్రమాలకు వారసులుగా చరిత్ర హీనులుగా నిలిచిపోతున్నారని, ఏపిలో పేరుకు మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారని పాలన అంత అదృశ్య వ్యక్తులు సూచనల మేరకే సాగుతుందని, ఏ మంత్రికి వారి శాఖలపై పట్టు లేదని, అవగాహన సైతం లేకుందని, కొంతమంది మంత్రులకైతే అర్హతను బట్టి కాకుండా అధినేత భక్తితో అదృష్ట వసాత్తు దక్కిన పెదవులని, కొన్ని శాఖల మంత్రులైతే బయట ప్రయివేట్ వ్యక్తులు సిద్ధం చేసుకొచ్చిన ఫైల్స్ పై సంతకాలు చేసి ముడుపులుతో జేబు నింపుకుంటున్నారని, నేటి మంత్రి వర్గంలో రూల్స్ ను, చట్టాలను, న్యాయ నిబంధనలును పాటించేవారు లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అని, నేడు ప్రజాసేవతో అర్హత గల నేతలు చట్టసభలకు ఎన్నిక కాకపోవటం విచారం అని, రాజ్యాంగ బద్దమైన పాలన అమలు జరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ వుంటుందని,రాజ్యాంగ నిర్మాత కు అసలైన గౌరవం దక్కుతుందని ఆయన తెలిపారు.బాబాసాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలను నేటి పాలకులు రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటున్నారని, ప్రపంచ మేధావి అంబేద్కర్ ను పెట్టుబడి వర్గాలు, కొన్ని సంపన్న వర్గాలు ఒక వర్గానికి పరిమితం చేస్తు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పిసున్నారని, పేదరికం లేని నవ సమాజం ఏర్పడిన నాడే అంబేద్కర్ కు నిజమైన నివాళులు అర్పించినట్టని, అంబేద్కర్ కలలు కన్న రాజ్యాంగ భద్రత, పౌర భద్రత, అస్పృశ్యత నిర్ములన సాధించాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమ నిర్మాణం తోనే సాధ్యం అని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు.సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, కాసా రాజు,ఎండి హుస్సేన్,దుడ్డె త్రినాద్ , బర్ల ప్రసాద్ , దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్ , వాడపల్లి జ్యోతిష్,పిల్లాడి ఆంజనేయులు, వల్లి వెంకటేష్, ముప్పన రమేష్,మట్టపర్తి తులసి , మీర్జా నాజర్, కాకి శివ ప్రసాద్, మండవల్లి సూరిబాబు, రెడ్డి స్వర్ణ లత, కోట సుశీల తదితరులు పాల్గొని యున్నారు.
మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్