TV77తెలుగు కర్నూలు:
ఓర్వకల్లు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నన్నూరు వద్ద అదుపుతప్పి డివైడర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.తిరుపతి నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సివుంది.