4 నుంచి ఒంటిపూట బడులు


 TV77తెలుగు అమరావతి :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూల సురేష్ వెల్లడించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉదయం 7:30 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల నిర్వహణ ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్ 27 నుంచి 10వ తరగతి పరీక్షలు,  మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.