ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు సుదీర్ఘముగా వివరించిన ఎంపీ భరత్


 TV77తెలుగు ఢిల్లీ:

పార్లమెంట్ సమావేశాలలో ఈ రోజు సుమారు 25 నిముషాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు రాజమండ్రి అభివృద్ధి కొరకు మాట్లాడిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్  మార్గాని భరత్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రోడ్ల మరియు ఫ్లై ఓవర్స్ కు 20000 కోట్ల రూపాయల విలువ గల పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరి  కృతజ్ఞతలు తెలిపారు.

భారతదేశంలో వున్న ప్రతిభగల మంత్రుల్లో  నితిన్ గడ్కరి  ఒకరని కొనియాడారు.


లోక్‌స‌భ‌లో జాతీయ‌ర‌హ‌దారులు రవాణ శాఖ  పద్దులపై చ‌ర్చ‌

వైఎస్సార్పిపి త‌రపున చ‌ర్చ‌లో పాల్గొన్న రాజ‌మండ్రి ఎంపీ భ‌ర‌త్‌

ఏపికి పొడ‌వైన కోస్తా తీరం ఉంది

త‌రుచుగా వ‌చ్చే ప్ర‌కృతి వైప‌రీత్యాల వ‌ల్ల రోడ్లు దెబ్బ‌తింటున్నాయి.

రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వం ఆర్థిక స‌హాయాన్ని గ్రాంట్‌గా ఇవ్వాలి

రాజ‌మండ్రి నుంచి జాతీయ ర‌హ‌దారులు వెళుతున్నాయి

రాజ‌మహేంద్ర‌వ‌రం లో ఫ్లై ఓవ‌ర్ల ప‌ని పూర్తి కావ‌డం లేదు

మోరంపుడి జంక్ష‌న్ ను డెత్ జంక్ష‌న్ గా పిలుస్తున్నారు.

రాజాన‌గ‌రం జంక్ష‌న్‌,  దివాన్‌చెరువు,  లాలాచెరువు, బొమ్మురు, వేమ‌గిరి, క‌డియ‌పులంక‌, పొట్టిలంక‌, మోరంపుడి జంక్ష‌న్ల వ‌ద్ద ఎక్కువ యాక్సిండెట్లు జ‌ర‌గుతున్నాయి.

ఈ జంక్ష‌న్ల వ‌ద్ద ఫ్లై ఓవ‌ర్లు ఏర్పాటు చేయాలి.

బ్లాక్ స్పాట్‌ల వ‌ద్ద ఫ్లై ఓవ‌ర్లు ఏర్పాటు చేయాలి.

రోడ్డు భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై కేంద్రం సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రించాలి.

ట్రాఫిక్ నియ‌మాలు ఉల్లంఘించిన‌వారికి బీమా ప్రీమియాన్ని పెంచాలి.

2018లో మంజూరైనా ప‌నులు ఇంకా ప్రారంభించలేదు

రోడ్ల డివైడ‌ర్ల‌పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ ఉత్ప‌త్తి చేయాలి.

516ఈ గ్రీన్ నేష‌న‌ల్ హైవే కారిడార్ సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేయాలి.

షెడ్యూల్ 13 ప్ర‌కారం అమ‌రావ‌తి నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు ర్యాపిడ్ రోడ్డు కనెక్టివిటీ  నిర్మాణం చేయాలి.

33 ఆర్‌వోబి, ఆర్‌యుబిల‌ను పూర్తి చేయాలి.

నెల్లూరు- కృష్ణ‌ప‌ట్నం పోర్టు రోడ్డు అభివృద్ధి పనులు ఎంత‌వ‌ర‌కు వ‌చ్చాయి?

భోగాపురం ఎయిర్‌పోర్టు - విశాఖ‌ప‌ట్నం ఆరులైన్ల రోడ్డు ప‌నులు చేప‌ట్టాలి.

ఏపిలోని 450 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి, ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి.

రాష్ట్రంలో రోడ్లు వేయడం ప్రధమ ప్రాధాన్యత అని వేయడమే కాదు రోడ్డు సేఫ్టీ నిబంధనలు డబల్ ప్రయారిటీ అని తెలిపారు.

నేషనల్ హైవే మీద ప్రయాణం చేసే వాహనాల సంఖ్య గణనీయముగా పెరిగింది అని, ట్రాఫిక్ నిభంధనలు పాటించాలని, దీని మీద ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

2017-18 బడ్జెట్ లో రోడ్లకొరకు 800 కోట్లు కేటాయించగా 2022-23 లో కేవలం 250 కోట్లు మాత్రమే అని, పెట్రోల్ డీజిల్ మీద లీటరుకు 33 రూపాయలు సెస్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని అవి రాష్ట్రాలకు ఇవ్వవలసిందిగా కోరారు.

రాజమండ్రి ట్రాఫిక్ పోలీస్ వారి నివేదిక ప్రకారం 2018 లో 90 రోడ్డు ప్రమాదాలలో 29 మంది మరణించగా 109 మంది గాయపడ్డారు, 2019 లో 119 రోడ్డు ప్రమాదాలలో 42 మంది మరణించగా 121 మంది గాయపడ్డారు, 2020 లో 116 రోడ్డు ప్రమాదాలలో 36 మంది మరణించగా 115 మంది గాయపడ్డారు అని అంతటి ప్రమాదకర జంక్షన్ రాష్ట్రంలోనే ఎక్కడా లేదని, వీరి మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని తెలిపారు.

కేంద్రప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే నా పార్లమెంట్ పరిధిలోని రాజమండ్రి నగరానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ భరత్ కోరారు.