TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్ :
రాజమహేంద్రవరం రూరల్ లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా కడుతున్న ఇంటి పనులను నిలిపివేయడానికి వెళ్లిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పై కొందరు వ్యక్తులు దొర్జన్యానికి పాల్పడి విధులకు ఆటంకం కలిగించారు. వివరాల్లోకి వెళితే.. తెలుగు విశ్వవిద్యాలయం సమీపంలోని సర్వే నంబర్ 385లో అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్నారని రెవెన్యూ అధికారులకు ఆదివారం సమాచారం రావడంతో. హుటాహుటిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్ సాగర్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, అక్కడ ఇంటి నిర్మాణానికి ముగ్గులు వేసి పిల్లర్లు వేసే పనులు జరుగుతున్నాయి. దీంతో రికార్డు చూపించాలని కోరగా పైడమళ్ల జయలక్ష్మి, ఇనపాల పుష్ప, మరికొందరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పైదొర్జన్యానికి పాల్పడి దుర్భాషలాడారు. పనులు ఆపకుండా కొనసాగించారు. దీంతో తహసీల్దార్ రియాజ్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు ధవశేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు..