TV77తెలుగు రాజమహేంద్రవరం :
మంగళవారం రాజమహేంద్రవరం జిల్లా పొలిసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు , అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, సారా నియంత్రణ, నిందితులపై నేరవిచారణ, ప్రాసిక్యూషన్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించినారు. అర్బన్ జిల్లా ఎస్పీ ముఖ్యముగా సారా నియంత్రణ, నిందితులపై నేరవిచారణ, ప్రాసిక్యూషన్ అనే అంశాలపై చర్చించినారు. అలాగే నిందితులు అరెస్ట్ కాబడి రిమాండు కు పంపిన తరువాత, గతంలో వారిపై పాత కేసులు ఉన్నప్పటికీ వారికి త్వరగా బెయిల్ రావటానికి గల వైపల్యాలు గురించి, అలాగే రిమాండ్ రిపోర్టు విషయాలు గురించి, నేరము చేసిన నిందితునికి ప్రాసిక్యూషన్ అయిన అనంతరము అతనికి కోర్టు నందు శిక్ష పడే విధముగా తీసుకోవలసిన చర్యల గురించి ఎ.పి.పి.లతో చర్చించినారు. ఇక ముందు కేసుల దర్యాప్తు చేసేటప్పుడు సమగ్రమైన నేర విచారణ చేసి నేరస్తులకు శిక్ష పడే విదముగా దర్యాప్తు కొనసాగించుకుంటూ వెళ్ళాలని, దీని ద్వారా నిందితులకు బెయిల్ త్వరగా రాకుండా ఉంటుంది అని, అలాగే వారిపై మోపబడిన కేసులలో వారికి శిక్ష ఖరారు అయితే వారికి తిరిగి నేరం చేయటానికి భయం కలుగుతుందని, ఎ.పి.పి. లతో పోలీసు వారు సమన్వయముగా పని చేయాలని, వారికి సహకరించవలసినదిగా ఈ సందర్బంగా ఎస్పి అధికారులకు తెలియజేసారు.ఈ సమీక్ష సమావేశము నందు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా జోనల్ డి.ఎస్.పి.లు కుమారి ఎం.శ్రీలత, కె. వెంకటేశ్వర రావు, జె.వి. సంతోష్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ యం. రాంబాబు, మరియు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి. శ్రీరాములు, పి. రఘువీర్, కె. లక్ష్మి దేవి, ఒ. మహాలక్ష్మి, శ్రీవిద్య, మరియ ఎస్. విజయాకర్ లు పాల్గొన్నారు.