TV77తెలుగు కోరుకొండ :
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జక్కంపూడి రాజా..
ఆదివారం నాడు కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పాల్గొన్నారు.ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఈ అమ్మవారి జాతర మహోత్సవం ప్రతి ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.హిందూ సంప్రదాయంలో గ్రామ దేవతల ఉత్సవాలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయని, భక్తుల కోరికలను తీర్చే అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ జాతరకి జిల్లా నలుమూలల నుండి ప్రజలు వచ్చి, అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారాన్నారు. ప్రజలు భోగ భాగ్యాలతో,సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.ఈ జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపిస్తున్న పాలకమండలి సభ్యులను ఆయన అభినందించారు.