TV77తెలుగు రాజమహేంద్రవరం :
గిరిపుత్రులకు తండ్రిలా ఆదరణ...
గంజాయిని కూకటివేళ్ళతో పెకిలించిన ఖాకీ సింహం..
సిబ్బంది శ్రేయస్సే పరమావధి.
ఎవరూ ఆయన అనుకుండున్నారా...
ఆయనే తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఐపీఎస్ ఎస్పీగా ఆయన ఎక్కడ పనిచేసినా ఆ జిల్లా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడతారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనే గర్వము, అహంకారము ఆయనలో కనిపించనే కనిపించవు.న్యాయం కోసం తన తలపు తట్టే వారికి న్యాయం చేయటంలో ఎటువటి వత్తిళ్ళకు లొంగని ఒక ఐపీఎస్ అధికారి ఆయన.సిబ్బంది యోగ క్షేమాలకు పెద్దపీట వేయటంతో జిల్లాలో పనిచేసే హోంగార్డు దగ్గర నుంచి పైస్ధాయి అధికారుల వరకు ఆయనను దేవుడిలా కొలుస్తారనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.తప్పు చేసే అధికారులపై కొరఢా ఝుళిపించటంలో ఏమాత్రం వెనుకాడని అధికారి ఆయన, రౌడీషీటర్స్ పై ఉక్కుపాదం మోసి జిల్లాలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో ఆయన శైలి పలువురికి ఆదర్శంగా ఉంటుంది.అందరిని కలుపుకుని పోయే మనస్తత్వం. కర్తవ్య నిర్వహణలో రాజీపడని అధికారి ఆయన. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మూర్తీభవించిన ఒక మానవతావాది ఎస్పీ రవీంద్రబాబు ఐపీఎస్ అధికారి గురించి అక్షర రూపంలో రాసే అవకాశం రావటం సంతృప్తికరంగా ఉంది.
సత్యమేవ జయతే.