బాధిత కుటుంబాలకు బాసటగా సీఎం రిలీఫ్ ఫండ్..!!


 TV77 తెలుగు మైలవరం :

ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గరికిపాటి శ్రీదేవి..!!

ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ లో నియోజకవర్గం ముందజ లో ఉందని వాఖ్య...!!

ఆరోగ్య సమస్యలు ,ప్రమాదాల బారినపడిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి బాసటగా నిలుస్తుందని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గరికిపాటి శ్రీదేవి తెలిపారు. మూలపాడు గ్రామానికి చెందిన బాధిత కుటుంబానికి 25 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను గ్రామ సర్పంచ్ చింతల భూ లక్ష్మి తో కలిసి ఇరువురి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గరికపాటి శ్రీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయ నిధి చెక్కులు అందజేయడంలో మైలవరం నియోజకవర్గం ముందంజలో ఉందన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని కొనియాడారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరగతిన చెక్కులు పాస్ చేయించే బాధ్యత స్వయంగా ఆయనే తీసుకుంటున్నారని తెలిపారు.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న బాధితులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు..