TV77తెలుగు మహా రాష్ట్రం :
న్యాయ జ్యోతి మహా రాష్ట్రంలోని సతార జిల్లా నాయగావ్ లొ 1831 వ సంవత్సరం జనవరి 3 వ తేదీన జన్మించారు. తల్లి పేరు లక్ష్మిబాయి తండ్రి పేరు ఖండోజీ. తన చిన్న వయస్సు లోనే మహాత్మ జ్యోతి రావు పూలే గారితో వివాహం జరిగింది. "సావిత్రి బాయి కి చదువు పట్ల ఉన్న ఆసక్తి వల్ల పూలే గారే స్వయంగా చదువు నేర్పడం జరిగింది. "భావి భారతానికి సరైన మార్గం చూపించగలిగిన ఒక ఆదర్శ విప్లవ మూర్తి. స్త్రీ మూర్తి గా సావిత్రి బాయి చరత్రకెక్కేందుకు వేసిన తొలి అడుగు, అమె చదువు నేర్చుకోవడం. "1848 ( 17 వ వయస్సు ) లో ఆమె ఈ దేశ తొలి మహిళా టీచర్ గా తాను నిర్మించిన ఒక పాఠశాల లో విద్య నేర్పించే భాద్యతను తీసుకుంది.1851 జూలై లో దళిత బాలికల కోసం ప్రత్యేకమైన పాఠశాలను ప్రారంభించింది.1851-1859 కాలంలో మహర్, మాంగ్ లా కోసం పాఠశాల మరియు అనాధలకోసం తొలి అనాధాశ్రమాన్ని ప్రారంభించారు. సావిత్రిబాయి మంచి కవయిత్రి, రచయిత్రి. 1854 లో ఆమె రాసిన 41 కవితల సంకలనం "కావ్యపూలే" విడుదలైంది.1853 బాల విధవలకు మరియు దురదృష్టవ శాత్తు అత్యాచారానికి గురై గర్భం ధరించిన స్త్రీలకు ఓ ప్రసూతి గృహం ఏర్పాటుచేశారు. వారు బిడ్డ పుట్టిన తరువాత బిడ్డను వదలి వేళ్ళేవారు.1873 కి ఇలా అక్కడ 66 మంది జన్మించారు .సావిత్రి బాయి లోని మానవత్వానికి ఈ గృహం ఒక చెక్కు చెదరని ఉదహరణ. ప్రేమ, కరుణ , సమత - అనేవి ఆమె లోని అంతర్బాగమైన గుణాలు.1855 న కాశీ బాయి అనే బ్రహ్మణ విధవకు వివాహేతర సంబంధం వల్ల జన్మించిన బిడ్డను తన బిడ్డగా స్వీకరించి యశ్వంత్ అనే పేరు పెట్టి తన బిడ్డగా పెంచింది. మహాత్మ జ్యోతి భా పూలే , సావిత్రి బాయి కలసి 1848-53 వరకు 18 పాఠశాలలు స్థాపించారు.1890వ సంవత్సరంలొ 63 ఏళ్ల వయస్సు లో భారతదేశం మొట్టమొదట మహాత్మ అయిన జ్యోతి భా పూలే పరి నిర్వానం చెందారు. అప్పటికి సావిత్రి బాయి పూలే 60 ఏళ్ళ వయస్సు. తన భర్త చితికి తానే స్వయంగా నిప్పంటించింది. "1896 వ మహారాష్ర్టం లో కరువు వచ్చింది, చాలామంది మరణించారు. అదే సమయంలో ప్లేగు వ్వాధి కుడా వచ్చింది. ఇటువంటి భయంకర పరిస్థితుల్లొ సావిత్రి బాయి చేపట్టిన సేవ అక్కడి ప్రజలు ఈ నాటికి చెప్పుకుంటారు"ఆ విరమమెరుగని సేవ వల్ల సావిత్రి బాయి జ్వరపీడితురాలైంది. ఆమె ఆరోగ్యం క్షీణించింది, "1897 మార్చి 10 న మహ పరినిర్వాణం" చెందింది" "మా చదువులతల్లి , ఆదర్శ విప్లవ స్త్రీ మూర్తి కి మరియు ఆధునిక భారత తొలి మహిళా టీచర్ కు శత కోటి వందనాలు.మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణి భారత తొలి మహిళా టీచర్ సావిత్రి బాయి పూలే వర్థంతి"
martxoa 10, 2022