TV77తెలుగు రాజమహేంద్రవరం :
రాజమండ్రి శానిటోరియమ్, భవానీపురం నందు నివసించే అడారి సురేష్ దంపతులకు వారం రోజుల క్రితం ఒక పాప జన్మించింది. దానవాయిపేట ప్రైవేట్ హాస్పిటల్ లో పుట్టిన పాపకు హృదయం నందు హోల్ ఉందని ప్రాణం చాలా క్లిష్ట పరిస్థితి మరియు వెంటిలేటర్ పై ఉండటం వారు ఎంపీ భరత్ దృష్టికి తీసుకుని రాగా, ఆపరేషన్ నిమిత్తం సుమారు 4 లక్షల 50 వేల రూపాయలు మహేష్ బాబు ఫౌండేషన్ వారు సహాయం చెయ్యడానికి ముందరకు రావడం, హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ నందు శస్త్ర చికిత్సకు తీసుకుని వెళ్లాలని, పెడియేట్రిక్ వెంటిలేటర్ అంబులెన్సు మన జిల్లాలో అందుబాటులో లేకపోవడం తెలుసుకుని రెయిన్బో ఆసుపత్రి యాజమాన్యం తో ఎంపీ భరత్ మాట్లాడి వాహనం ఏర్పాటు చేయడం ఆ పాప హైదరాబాద్ చేరడం జరిగింది రేపు ఆ పాపకు శాస్త్ర చికిత్స జరుగుతుంది అని ఎంపీ భరత్ తెలిపారు. అంబులెన్సు కు 42000 అవుతాయని అవి ఇవ్వడానికి స్తోమత లేని వారి భాధ అర్ధంచేసుకుని హెల్పింగ్ హాండ్స్ వాట్సాప్ గ్రూప్, స్వర్ణ ఆంధ్ర సేవ సమితి, రోటరీ రివర్ సిటీ మరియు మానవతా స్వచ్చంధ సంస్థ వారిని సంప్రదించగా తక్షణమే వారు ఈ 42000 రూపాయలను ఎంపీ భరత్ చేతులమీదుగా పాప కుటుంబ సభ్యులకు అందచేయడం జరిగింది. ఇటువంటి సంఘటన లో మానవతా దృక్పధము తో ముందరకు వచ్చి సహాయం చేసిన ఈ సంస్థలకు ఎంపీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో పాప కోలుకుని తన తల్లి దగ్గరకు చేరి మంచి స్థాయికి ఎదగాలని ఎంపీ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు గుబ్బల రాంబాబు, అనూప్ జైన్, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, అడారి లక్ష్మి నారాయణ దంపతులు, వైస్సార్సీపీ బీసీ సెల్ కార్యదర్శి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.