సాహితీవేత్త ఎండ్లూరికి ఘన నివాళి


 TV77తెలుగు రాజహేంద్రవరం:

రాజమహేంద్రవరంతో ముడిపడిన ఎండ్లూరి సాహితీ ప్రస్థానం: చందన నాగేశ్వర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ సంస్మరణసభ జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక రాజహేంద్రవరం రూరల్ వైసిపి కార్యాలయంలో ప్రముఖ సాహితీవేత్త సూర్యవంశీ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా పాల్గొన్న రాజమహేంద్రవరం స్మార్ట్సిటీ చైర్మన్ రరూల్  కో-ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ ఎండ్లూరి చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి మాట్లాడుతూ ఆచార్య సుధాకర్ కు రాజమహేంద్రవరంతో విడదీయరాని అనుబంధం వుందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయానికి పీఠాధిపతిగా పనిచేయడం జరిగిందని, అంతేకాకుండా ఆయన సాహితీ ప్రస్థానం రాజమహేంద్రవరంలో ఎక్కువ జరిగిందన్నారు. సాహితీవేత్త సూర్యవంశీ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల, పీడిత ప్రజల పక్షాన నిరంతర సాహీతీ ప్రక్రియచేస్తూ 14 గ్రంథాలను ఎండ్లూరి రచయించారని అన్నారు. జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ ఎండ్లూరి సుధాకర్ కు పడాల కుటుబంతో విడదీయరాని అనుబంధం వుందని, ఆయన తెలుగు యూనివర్శిటీ పీఠాధిపతిగా వుండగా 'విప్లవజ్యోతి' అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య సమరయోధులు, నా తండ్రి పడాల రామారావులపై ఎండ్లూరి శిష్యుడు పెనుమాకుల భాస్కరరావుచే ఎం.ఫీల్., పిహెచ్.డి., డాక్టరేట్లు చేయించిన గొప్ప సాహితీవేత్త ఎండ్లూరి అని పడాల అన్నారు. పెనుమాకుల భాస్కరరావు మాట్లాడుతూ డా|| బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలతో పేద, బడుగువర్గాల కనుగుణంగా సాహిత్యాన్ని అందించిన మహోన్నతుడు ఎండ్లూరి సుధాకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వర్కింగ్ ప్రెసిండెంట్  వెల్లాల నాగార్జున, కోశాధికారి బళ్ళా శ్రీనివాస్ (మయూరి శ్రీను) వైసిపి నాయకుడు నరవ గోపాలకృష్ణ, చీకట్ల శివన్నారాయణ, యర్రా కృష్ణకుమార్ తతదితరులు పాల్గొన్నారు.