వైసీపీ యువజన విభాగం లో కొత్త జోష్...!!!


 TV77తెలుగు మైలవరం :

మైలవరం నియోజకవర్గ వైసీపీ నూతన కమిటీల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న అధినాయకత్వం...!!!

కొండపల్లి మున్సిపాలిటీ యువజన విభాగం అధ్యక్షుడుగా మడుపల్లి ఆనంద్..???

కొండపల్లి యువజన విభాగం భాద్యతలు ఆనంద్ కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం...!!

గతం లో యువజన విభాగం లో పనిచేసిన అనుభవం కలిసొస్తుందని పార్టీ పెద్దల సమాలోచనలు...!!

మైలవరం నియోజకవర్గ వైసీపీ లో నూతన కమిటీల ఏర్పాటు తో కొత్త జోష్ నింపుతుందని పార్టీ అధినాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తోంది. నూతన కమిటీల నియామకాలతో పార్టీ మరింత బలోపేతం కావడం తో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం దోహదపడుతుందని అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నూతన కమిటీల నియామకం పై పార్టీ నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా గ్రామాల వారీగా అధ్యక్ష , కార్యదర్శులు నియామకాలపై దృష్టి సారించిన అధినాయకత్వం యువజన విభాగం పై కూడా ఫోకస్ పెట్టినట్లు విశ్వశనీయ సమాచారం... మైలవరం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల , గ్రామ యువజన విభాగం కమిటీలు ఏర్పాటు కు కసరత్తు చేస్తుండగా ప్రతిష్టాత్మక కొండపల్లి మున్సిపాలిటీ యువజన విభాగం పై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ యువజన విభాగం అధ్యక్షుడు గా ఆర్య వైశ్యులు సామాజిక వర్గానికి చెందిన మడుపల్లి ఆనంద్ ను నియమిస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. మడుపల్లి ఆనంద్ రాజకీయంగా వైసిపికి వీర విధేయుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం తో పాటు ఇబ్రహీంపట్నం యువజన విభాగం లో పని చేసిన అనుభవం పరిగణం లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆర్య వైశ్య సామాజిక వర్గానికి కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంటుంది అనేది అధినాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. పార్టీలో వైశ్యులకు సముచిత స్థానం కల్పించి ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడం కోసం పార్టీ అధిష్టానం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

జరుగుతున్న ప్రచారం మేరకు కథనం..

సత్య..రిపోర్టర్, మైలవరం