ప్రజలకు ప్రభుత్వాలు ఆదర్శంగా నిలవటంలో విఫలమైతున్నాయి:మేడా శ్రీనివాస్



 TV77తెలుగు  రాజమండ్రి :

ప్రజా స్వామ్యంలో  గణతంత్ర దినోత్సవం జరుపుతున్న పాలకులుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయం వద్ద నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్ దినోత్సవ కార్యక్రమంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆవేదన చెందారు.  తొలుత పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద,స్వాతంత్ర్య పోరాట ఉద్యమ యోధుడు  నేతాజి శుభాష్ చంద్రబోస్ వారికి నివాళిలు అర్పించారు.  గణతంత్ర దినోత్సవం వేడుకను పురష్కరించుకుని ఆర్పిసి అధినేత మేడా శ్రీనివాస్ జాతీయ జండాను ఆవిష్కరించి గౌరవ వందనాలు చేసారు. అనంతరం పార్టి సెక్యులర్స్ కు, శ్రేణులకు స్వీట్లు పంపిణి చేసారు. పాలకుల తీరు పాలనా వైఫల్యం కారణంగా ప్రజల్లో జాతీయ భావాలు అడుగంటిపోతున్నాయని,దేశాన్ని, ప్రకృతిని ప్రేమించని వారిని పుడమి తల్లికి బారంగా భావించాలని,ప్రజలకు ప్రభుత్వాలు ఆదర్శంగా నిలవటంలో విఫలమైతున్నాయని, నిత్యం పౌర హక్కులు నిర్వీర్యం అయితున్నాయని, సమాజానికి ఆదర్శ వంతమైన సేవలు అందివ్వటంలో పార్టీ సెక్యులర్స్ కీలక పాత్ర పోషించాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పార్టీ సెక్యులర్స్ ను శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.  ఈ కార్యక్రమంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ కాసా రాజు, పెండ్యాల కామరాజు,దుడ్డె త్రినాద్ ,  సత్తి వెంకట రెడ్డి, లంక  దుర్గా ప్రసాద్, మేడిచర్ల శ్రీనివాసరావు, వర్ధనపు శరత్ కుమార్, సిమ్మా దుర్గా రావు , పిల్లాడి ఆంజనేయులు, వల్లి శ్రీనివాసరావు, కారుమూరి యుగంధర్, కారుమూరి శిరీషా, వనుం శ్రీనివాస్, దోషి నిషాంత్, మేడా చిన్నారి, పి. ప్రసాద్, బర్ల ప్రసాద్, షకీలే సన్నీ, కొల్లి సిమ్మన్న తదితరులు పాల్గొనియున్నారు. 

కాసా రాజు, జిల్లా నాయకులు, 

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తూర్పు గోదావరి జిల్లా