ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు విశేష సేవ‌ల‌ను అందించార‌ని ది బెట‌ర్ ఇండియా సంస్థ తెలిపింది.


 TV77 తెలుగు అమరావతి :
క‌ష్ట స‌మ‌యాల్లో ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు విశేష సేవ‌ల‌ను అందించార‌ని ది బెట‌ర్ ఇండియా సంస్థ తెలిపింది. అంతేకాదు ఇండియాలోనే బెస్ట్ డీజీపీగా గౌత‌మ్ స‌వాంగ్ అని ది బెటర్ ఇండియా సంస్థ వెల్ల‌డించింది. ప్ర‌జ‌ల‌కు ఉత్త‌మ సేవ‌లు అందించ‌డంలో అత్యుత్త‌మ డీజీపీ ఆయ‌నేన‌ని ప్ర‌క‌టించింది. 2021వ సంవత్స‌రంలో దేశంలో ఉత్త‌మ సేవ‌లు అందించిన 12మంది ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల జాబితాను విడుద‌ల చేసిందా సంస్థ‌. కాగా దిశా యాప్ ద్వారా మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ సేవ‌ల‌ను కొనియాడింది ది బెట‌ర్ ఇండియా సంస్థ‌. అత్యుత్తమ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చాలా బాగా పనిచేస్తుందని వివ‌రించింది.ఇలాంటి సేవలు మరిన్ని అమలు చేయాలని… ఏపీ డీజీపీ గౌతమ్ ను దేశంలోని అందరూ మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించింది.