బంగారం కొనే వాళ్ళకి శుభవార్త


 TV77తెలుగు :
శనివారం కూడా బంగారం ధరలు నేలచూపులు చూశాయి. దీంతో బంగారం ధర వరుసగా రెండో రోజూ కూడా పడిపోయిందని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. వెండి ధర వెలవెలబోయింది. దీంతో బంగారం వెండి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. తెలంగాణ హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగిచ్చింది. పసిడి రేటు వెలవెలబోయింది. కిందకు వచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 390 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ. 48,650కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 350 క్షీణతతో రూ. 44,600కు తగ్గింది. బంగారం ధర పడిపోస్తే. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 900 పడిపోయింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 64,500కు దిగొచ్చింది. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్స్‌కు 0.39 శాతం పైకి ఎగసింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1796 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 0.90 శాతం పెరుగుదలతో 22.39 డాలర్లకు ఎగసింది.కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి. ఇకపోతే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను జీఎస్‌టీ, ఇతర పన్నుల, తయారీ చార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాలి.