TV77 తెలుగు అడ్డతీగల :
జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యకవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు
క్యాలెండర ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్షీదుర్గ (రోజా)
'విప్లవజ్యోతి' అల్లూరి సీతారామరాజు తూర్పు ఏజెన్సీలోని రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి వాస్తవ పోలీస్ స్టేషన్లను ప్రజల సందర్శనకు అనుగుణంగా అభివృద్ధిచేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అందుకు కృషిచేయాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు అన్నారు. ఆదివారం అడ్డతీగల మండలం పైడిపుట్ట గ్రామంలో అల్లూరి సీతారామరాజు రచ్చబండ ప్రాంగణంలో జరిగిన జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యవర్గ సమావేశం, అజాడీ కా అమృత మహోత్సవంలో భాగంగా అల్లూరి 125వ జయంతి కార్యక్రమంలో పడాల ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎస్పీగా వున్న నయీం అస్మీ రంపచోడవరం పాత పోలీస్ స్టేషన్ ను మ్యూజియంగా, అడ్డతీగల వస్తావ పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రహరినిర్మించి, ఉద్యానవనంగా తయారుచేసి సందర్శకులకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని, రాజవొమ్మంగి పాత పోలీస్ స్టేషన్ గ్రంథాలయం ఏర్పాటుచేస్తామని, స్మారక మందిరంగా రూపొందిస్తామని చెప్పి ఆనాడు హడువుడిగా తాత్కాలికంగా మైనర్ రిపేరులు చేసి రంగులు వేసారు. అయితే ఎక్కడ గొంగలి అక్కడే వుందని మళ్ళీ అవి శిధిలావస్థకు చేరుకుంటున్నాయని పదాల ఎద్దేవా చేశారు. వాటిని అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని అభివృద్ధిచేసి ప్రజలకు అంకితమివ్వాలన్నారు. అలాగే అల్లూరి చరిత్రలో సువర్ణ ఘట్టంగా నిలిచిన రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామంలో 1924 మే 1 నుండి 6వ తేదీ వరకు బ్రిటీష సేనలకు, అల్లూరి సేనలకు జరిగిన తుదిపోరుకు చిహ్నం అక్కడ ఏదైన భారీ ప్రాజెక్టును చేపట్టాలని పడాల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఆల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని నేతాజీ పేరుని విడుదలచేసిన 125 రూపేనాణాన్ని అల్లూరి పేరున కూడా విడుదల చేయాలని అల్లూరి విగ్రహానికి అనుమతి వున్న పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు మా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘానికి అనుమతిని ఇవ్వాలని పడాల కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఏర్పాటుచేసిన గంగాలమ్మ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి అనంత లక్ష్మీ దుర్గ (రోజా) పూజలు జరిపి, 2022 సంవత్సరం అల్లూరి క్యాలెండర్ను ఆవిష్కరించారు.