జూదారులపై నిఘా నేత్రాలు..!!


 TV77 తెలుగు ఇబ్రహీంపట్నం :

ములపాడు గ్రామంలో పేకాట ఆడుతున్న  జూదారులను అదుపు లోకి తీసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు...!!

పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు,  12 వేల 300 మేర నగదు స్వాధీనం...!!

సంక్రాంతి సమీపిస్తున్న నేపధ్యంలో ఇబ్రహీంపట్నం మండలం వ్యాప్తంగా పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. కోడిపందాలు, జుదాలు లాంటి కార్యకలాపాలకు పెట్టేందుకు గస్తీ ముమ్మరం చేశారు.ఈ క్రమంలో ములపాడు గ్రామం లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.. ఇబ్రహీంపట్నం ఎస్ఐ శ్రీనివాస్ నేతృత్వం లో జరిగిన దాడుల్లో సుమారు 12 వేల 300 మేర నగదు స్వాధీనం చేసుకుని పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కోడిపందాల శిబిరాలు, జుదాలు నిర్వహించే వారిని ఉప్పెక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.

సత్య...రిపోర్టర్,మైలవరం