TV77తెలుగు రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధి సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ లతో జిల్లా
పోలీసు కార్యాలయం, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. దీంట్లో భాగంగా
ఎస్పీ కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. మహిళల భద్రత కోసం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మహిళలు, విద్యార్థినులు, యువతులు దిశా యాప్ డౌన్లోడ్ చేసుకోని సక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోనే విధంగా మహిళా పోలీసులు, మహిళలకు అవగాహనా కల్పించాలని ఇప్పటి వరకుమనరాష్ట్రంలో మహిళా పోలీస్ లు కృషివల్ల సుమారు 75 లక్షల మంది మహిళలతో దిశ యాప్ ను డౌన్లోడ్ చేయించగల గా మని ఈ యాప్ పట్ల వారికీఅవగాహన కల్పించినారు. మహిళా పోలీసులు బాగా పనిచేసి ప్రజలకు పోలీసు పరంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేసి మహిళా పోలీసులు హోం డిపార్టుమెంటుకు మంచి పేరు తీసుకురావాలి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమములో అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్) కె. లతా మధురి , అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సిహెచ్ పాపారావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ డి.శ్రీనివాస రెడ్డి, దిశ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ కె.తిరుమల రావు, తదితరులు పాల్గొన్నారు..